వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్ డ్రైవర్ కోసం ఎసిబి, కెటిఆర్ గన్‌మెన్ కోసం సిఐడి, బాబుతో కొండల్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నోటీసులు జారీ అయిన టిడిపి యువనేత నారా లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డి గురువారం నాడు ఎసిబి ఎదుట హాజరు కాలేదు. దీంతో ఎసిబి మరో నోటీసు ఇవ్వాలని భావిస్తోంది. ప్రస్తుతం కొండల్ రెడ్డిని విశాఖ పంపించారని ఏపి పోలీసు ఉన్నతాధికారుల ద్వారా తెలిసిందని వార్తలొస్తున్నాయి.

గురువారం ఉదయం 10.30 గంటలకు ఏసీబీ కార్యాలయానికి రావాల్సిన అతడు సాయంత్రం దాకా ఏసీబీ అధికారులు ఎదురు చూసినా రాలేదు. దీంతో మరో మారు నోటీసులు జారీ చేయనుంది. ఆ తర్వాత కూడా స్పందించకుంటే ఆ తదుపరి చర్యలకు కూడా ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

మరోవైపు, కరీంనగర్ జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లకు నోటీసులు ఇచ్చేందుకు ఏపీకి చెందిన డిఎస్పీ స్థాయి అదికారి నేతృత్వంలోని బృందం గురువారం కరీంనగర్‌కు చేరుకుంది. వారు ఎస్పీని కలిసేందుకు ప్రయత్నించగా ఆయన బదలీల కౌన్సెలింగులో ఉండటంతో రాత్రి వరకు సాధ్యపడలేదు.

లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డికి తెలంగాణ ఎసిబి అదికారులు నోటీసులు జారీ చేయగా, ప్రతిగా మంత్రి కెటిఆర్ గన్‌మెన్లు, డ్రైవర్లుగా పని చేస్తూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కేసులు నమోదైన రాజ్ కుమార్, సతీష్, రవి, రమేష్‌లకు నోటీసులు ఇచ్చేందుకు ఏపీ పోలీసులు వచ్చినట్లుగా తెలుస్తోంది. విశాఖ జిల్లా పెందుర్తి కేసుకు సంబంధించి నోటీసులు ఇస్తున్నారు.

కొండల్ రెడ్డికి ఇచ్చిన నోటీసు

కొండల్ రెడ్డికి ఇచ్చిన నోటీసు

టిడిపి యువనేత నారా లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ బుధవారం నాడు ఇచ్చిన నోటీసు.

కొండల్ రెడ్డి

కొండల్ రెడ్డి

టిడిపి యువనేత నారా లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ బుధవారం నాడు ఓటుకు నోటు కేసులో నోటీసులు ఇచ్చింది. ఆయన గురువారం హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కాలేదు.

చంద్రబాబుతో కొండల్ రెడ్డి

చంద్రబాబుతో కొండల్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో గతంలో ఫోటో దిగిన కొండల్ రెడ్డి.

లోకేష్‌తో కొండల్ రెడ్డి

లోకేష్‌తో కొండల్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌తో కొండల్ రెడ్డి ఉన్న దృశ్యం. ఓటుకు నోటు కేసులో కొండల్ రెడ్డి టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గన్‌మెన్లతో ఫోన్లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది.

కెటిఆర్ గన్‌మెన్, డ్రైవర్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఎపి సీఐడీ ప్రయత్నం

కెటిఆర్ గన్‌మెన్, డ్రైవర్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఎపి సీఐడీ ప్రయత్నం

కెటిఆర్ గన్‌మెన్ జానకిరాం, డ్రైవర్ సత్యనారాయణల చిరునామాను వెతికే పనిలో ఏపీ సిఐడి అధికారులు పడ్డారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు చెప్పాలని టిఆర్ఎస్ నాయకులు బెదిరించారని జెరూసలేం మత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు కేసు దర్యాఫఅతులో భాగంగా రెండు రోజుల కిందట వారికి నోటీసులు జారీ చేశారు.

కెటిఆర్ గన్‌మెన్, డ్రైవర్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఎపి సీఐడీ ప్రయత్నం

కెటిఆర్ గన్‌మెన్, డ్రైవర్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఎపి సీఐడీ ప్రయత్నం

వీటిని సంబంధితులకు అంద జేసేందుకు బుధవారం కెసిఆర్ క్యాంపు కార్యాలయం, నందినగర్లోని కెటిఆర్ పాత ఇంటికి వెల్లారు. నిఘా భద్రత విభాగానికి వెల్లారు. అక్కడా లేకపోవడంతో వెనుదిరిగారు.

కెటిఆర్ గన్‌మెన్, డ్రైవర్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఎపి సీఐడీ ప్రయత్నం

కెటిఆర్ గన్‌మెన్, డ్రైవర్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఎపి సీఐడీ ప్రయత్నం

వీరు కరీంనగర్, నిజామాబాదులలో ఉన్నారని తెలియడంతో గురువారం సిఐడి అధికారులు ఆయా జిల్లాలకు వెళ్లారు. అక్కడ వారు అందుబాటులో లేరు. వారి చిరునామా తెలుసుకొని ఇస్తామని లేదంటే నిఘా భద్రత విభాగం ఉన్నతాధికారులకు తెలియజేస్తామని చెప్పారు. తొలుత 14న హాజరు కావాలని, నోటీసులు ఆలస్యమైతే మరో తేదిన హాజరు కావాలని పేర్కొన్నారని సమాచారం.

English summary
Kondal Reddy fails to appear before ACB in Cash for vote scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X