వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాకేమీ తెలియదు, నాన్నే మాట్లాడాడు: ఎసిబి విచారణలో కృష్ణ కీర్తన్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో వ్యవహారాల గురించి తనకేమీ తెలియదని, తన ఫోన్‌తో తన నాన్నే మాట్లాడడాని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డి ఎసిబి అధికారులకు చెప్పారు. ఓటుకు నోటు కేసులో టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్‌రెడ్డిని ఏసీబీ రెండో రోజు గురువారం కూడా విచారించింది.

కృష్ణకీర్తన్ ఫోన్ నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్రవెంకట వీరయ్య, ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్‌సింహతో మాట్లాడటానికి నేపథ్యమేమిటన్న కోణంలో గురువారం ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. మొదటి రోజు సండ్రతో మాట్లాడటానికి కారణాలపై దృష్టి సారించిన ఏసీబీ అధికారులు రెండోరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సాగిన విచారణలో ఉదయ్‌సింహాతో కృష్ణకీర్తన్ ఫోన్‌లో తొమ్మిది సార్లు మాట్లాడటానికి కారణాలపై ఏసీబీ అధికారులు విచారించారని తెలిసింది.

Cash for vote: Krishna Keertan Reddy says his phone was used by his father

అన్నిసార్లు ఉదయ్‌సింహాతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని కృష్ణకీర్తన్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. ఆ సంభాషణల నేపథ్యమేమిటని ఏసీబీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. రేవంత్, ఉదయ్‌సింహా, సండ్రలతో తన తండ్రి నరేందర్‌రెడ్డి తన ఫోన్ నుంచి మాట్లాడారని తమ విచారణలో కృష్ణకీర్తన్ వెల్లడించినట్లు ఏసీబీ అధికారి ఒకరు తెలిపారు.

దీంతో ఓటుకు నోటు కేసులో వేం నరేందర్‌రెడ్డి పాత్రపై పూర్తిస్థాయిలో అధికారాలు సేకరించామని ఆయన తెలిపారు. సాయంత్రం ఐదుగంటల వరకు విచారణ జరిగిన తర్వాత కృష్ణకీర్తన్ రెడ్డి ఏసీబీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.

English summary
According to sources- Telangana Telugu Desam party leader Vem Narender Reddy's son told ACB that his phone was used by his father.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X