వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చీటింగ్: ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసలెం మత్తయ్య అరెస్ట్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్యను ఓ చీటింగ్ కేసులో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారుల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఏకంగా హైదాబాద్ నుంచి నవ్యాంధ్రకు మత్తయ్య వెళ్లిన సంగతి తెలిసిందే.

గొంతు నాదే, కెటిఆర్- ఆయన డ్రైవర్ సంగతేమిటి?: మత్తయ్య గొంతు నాదే, కెటిఆర్- ఆయన డ్రైవర్ సంగతేమిటి?: మత్తయ్య

అక్కడి వెళ్లిన తర్వాత హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు ముందస్తు బెయిల్ పొందిన తర్వాతే ఆయన హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. అయితే ఓటుకు నోటు కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకున్న మత్తయ్య తాజాగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని తన చేతివాటాన్ని ప్రదర్శించాడు.

Cash for vote scam accused jerusalem mattayya arrested in cheating case

చైతన్యపురి సీఐ గురు రాఘవేంద్ర కథనం ప్రకారం, మత్తయ్య 2006వ సంవత్సరంలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తున్న విద్యార్థులకు స్టార్‌హోటళ్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకుని మోసం చేయడంతో కొత్తపేటకు చెందిన కిరణ్‌కుమార్ అనే బాధితుడు సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

కరివేపాకులా వాడుకుని వదిలేశారు: చంద్రబాబుపై మత్తయ్య ఫిర్యాదుకరివేపాకులా వాడుకుని వదిలేశారు: చంద్రబాబుపై మత్తయ్య ఫిర్యాదు

ఈ ఫిర్యాదు మేరకు మత్తయ్యపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు. మేజిస్ట్రేట్ జారీచేసిన ఆదేశాల మేరకు ఉప్పల్‌లో ఉంటున్న మత్తయ్యను చైతన్యపురి పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా 11వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చిన ఆ తర్వాత చర్లపల్లి జైలుకు తరలించారు.

English summary
Cash for vote scam accused jerusalem mathaiah arrested in cheating case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X