చీకోటి ఫాంహౌస్ లో సోదాలు : లింకులు పైనా ఫోకస్..!!
రాష్ట్రంలో కలకలం రేపుతున్న క్యాసినో వ్యవహారంలో కీలకంగా మారిన చీకోటి ప్రవీణ్ కు సంబంధించి అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కేసినో నిర్వహణ ద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలతో ప్రవీణ్ తో పాటుగా మధవరెడ్డి నివాసాల పైన ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. వారిద్దరినీ విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. నేపాల్‌లో జూన్ 10 నుంచి 13 వరకు నాలుగు రోజులపాటు క్యాసినో వేగస్ బై బిగ్‌డాడీ పేరిట... పెద్దఎత్తున గ్యాంబ్లింగ్ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఫాంహౌస్ లో సోదాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పంటర్లను హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. ఇదే సమయంలో చీకోటి ప్రవీణ్ ఫాంహౌస్‌లో అటవీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అందులో మాట్లాడే రామచిలుకలు, ఊసరవెల్లులు ఉన్నట్లు గుర్తించారు. బల్లులు, ఆస్ట్రిచ్, గుర్రాలు, కుక్కలు ఉన్నాయని తేలింది. ఇక, ఆవులు, ఉడుములు, పురాతన రథం ఉన్నాయని చెబుతున్నారు. సింహాల ఇత్తడి విగ్రహాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు షాక్ అవుతున్నారు. అటవి, విజిలెన్స్ అధికారులుజంతు అక్రమ రవాణా నియంత్రణ అధికారులు తనిఖీలు చేసారు.

లాప్ టాప్,..మొబైల్ కీలకంగా
అయితే, ఫాం హౌస్ లో అనుమతి లేకుండా వేటిని ఉంచలేదని..అనుమతి తోనే పక్షులను పెంచుతున్నామని చీకోటి సిబ్బంది చెబుతున్నారు. కోట్లలో నగదును విదేశీ మారకంగా మార్చిన అంశంపైన ఆరా తీస్తున్నారు. తెలుగురాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రవీణ్‌కు గల సన్నిహిత సంబంధాలపైనా.. ఆరా తీస్తున్నారు. ఇందుకోసం వారి వాట్సాప్ చాటింగ్‌లను పరిశీలిస్తున్నారు. కొందరు సినీ తారలకు సంబంధించిన లింకులు వెలుగులోకి వస్తున్నాయి.

విచారణ సమయంలో మరింత సమాచారం
ప్రచార కర్తలుగా వ్యవహరించిన వారికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక, నోటీసులు ఇచ్చిన ఈడీ విచారణ సమయంలో ప్రవీణ్..మాధవరెడ్డి నుంచి మరింత సమాచారం సేకరించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరి ల్యాప్ టాప్.. మొబైల్స్ లో ఉన్న సమచారం సేకరించిన అధికారులు.. లింకులు ఉన్నట్లుగా గుర్తించిన వారికి నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. దీంతో..విచారణ సమయంలో ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయనే ఉత్కంఠ కొనసాగుతోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications