కులగణన సర్వే.. తెలంగాణలో బీసీ జనాభా ఎంతో తెలుసా?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయం మేరకు తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, కులగణన సర్వే చేపట్టామని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా రాష్ట్రంలో కులగణన అంశంపై మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందజేశారు. ఈ అంశంపై ఉత్తమ్ కుమార్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది.
ఈ సమావేశం అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, దామోదర రాజనర్సింహతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన తరగతుల ప్రజలకు న్యాయం చేయాలనేదే తమ ఆకాంక్ష అని తెలిపారు. స్వాతంత్ర్యం ముందు నుంచీ మనదేశంలో జనగణన జరుగుతోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కులగణన చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు.

బలహీన వర్గాల అభ్యున్నతికి అవసరమైన వివరాల సేకరణకు కులగణన చేపట్టామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. సామాజిక కులగణన సర్వేలో 1,03,889 మంది ఎన్యుమరేటర్లు పాల్గొన్నారని చెప్పారు. 96.9 శాతం (3.50 కోట్ల మంది) సర్వేలో పాల్గొని వివరాలు అందించారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. 3.1 శాతం మంది అంటే 16 లక్షల మంది వివిధ కారణాల వల్ల వివరాలు అందించలేదని వెల్లడించారు.
ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి ఇతర అంశాలపై సమగ్ర అధ్యయనం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఏ వర్గం జనాభా ఎంత ఉందో ప్రభుత్వం దగ్గర డేటా ఉందని.. బీసీ జనాభా 46.25 శాతం ఉందని తెలిపారు. సామాజిక న్యాయం కోసమే సర్వే చేసినట్లు మంత్రి తెలిపారు.
సర్వేను అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించినా.. అధికారులు విజయవంతంగా పూర్తి చేశారన్నారు. ఫిబ్రవరి 4న మంత్రివర్గం ముందు కులగణన సర్వే నివేదికను ప్రవేశపెడతామన్నారు. కేబినెట్‌లో చర్చించి వెంటనే శాసనసభలో ప్రవేశపెడతామని తెలిపారు. సమాజంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి ఉత్తమ్ వివరించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications