నమ్మి పెట్టుకుంటే ఇలానా? ఓ పనిమనిషి చేష్టలు, వైరల్ గా మారిన వీడియో!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇంట్లో పనిమనుషులు నమ్మకంగా పనిచేస్తుంటే యజమానులకు అంతకు మించిన ప్రశాంతత ఏదీ ఉండదు. కానీ కొంతమంది పనిమనుషులు మాత్రం సందు దొరికినప్పుడల్లా దోచేద్దామని అనుకుంటూ ఉంటారు.

అలాంటి ఓ పనిమనిషి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. పని చేసుకుంటూ వచ్చిన ఓ పని మనిషి మెల్లగా కబోర్డ్ డోర్ ను తెరచి అందులోని వస్తువులను స్వాహా చేయడాన్ని కెమెరా కన్ను పట్టేసింది.

అలా ఒకసారి కాదు, పలుమార్లు ఆ పనిమనిషి రావడం, కబోర్డ్ తెరవడం, అందులో తగిలించి ఉన్న దుస్తుల జేబులు చెక్ చేయడం, దొరికినవన్నీ తన జాకెట్ లో వేసుకోవడం.. ఇదే పని. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు బయటికి వెళ్లిపోయింది.

అయితే ఆ పనిమనిషి చేష్టలన్నీ రికార్డ్ అవుతోందని ఆమె అసలు గమనించలేదు. వెనుక ఉన్న ఓ సీసీ కెమెరాలో ఆమె యాక్షన్ మొత్తం రికార్డు అయిపోయింది. దొంగతనం చేస్తూ దొరికిపోయిన ఈ పని మనిషి వీడియోను చూసి యజమానులు షాక్ తినడం ఖాయం.

అయితే అందరూ ఈ పనిమనిషిలాగే ఉంటారని అనుకోలేం. మంచి వాళ్లూ ఉండొచ్చు. కానీ ఇలాంటి వాళ్లని తెలియక ఇంట్లో పనికి కుదుర్చుకుంటే మాత్రం గోవిందో.. గోవిందే! వీడియో చూడండి మీకే అర్థమవుతుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Caught on Camera - Servent Maid Activities, Video viral on Social Media. We can't say that all servent maids are like this, but this video goes viral on social media. Have a look how smart she is.
Please Wait while comments are loading...