విదేశీ డబ్బుతోనే దాడి: 'హిందుత్వంపై దాడి-కంచ ఐలయ్య' చర్చలో ఎమ్మెల్సీ

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ/హైదరాబాద్: కంచ ఐలయ్య సమాజంలోని కొన్ని కులాలను కించపరుస్తూ పుస్తకాలు రాస్తున్నారని, ఆయన వెనుక విదేశీ హస్తం ఉందని ఎమ్మెల్సీ రామచంద్ర రావు శనివారం ఆరోపించారు.

మీకు ఉన్నట్లే మాకూ ఉంది, అమెరికాకు మొరపెట్టుకుంటావా, కొట్టడమే వృథా: కంచ ఐలయ్యపై టిజి

విదేశీ డబ్బుతో హిందూ సమాజంపై దాడికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. మల్కాజిగిరిలో 'హిందుత్వంపై దాడి - కంచ ఐలయ్య' అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠికి రామచంద్ర రావు హాజరయ్యారు.

CBI should probe who behind Kancha ilaiah: Ramachandra Rao

ఐలయ్య రచనల వెనుక ఉన్న శక్తులపై సిబిఐ, ఎన్ఐఏతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేశద్రోహం కేసు నమోదు చేసి ఐలయ్యను ప్రాసిక్యూట్ చేయాలన్నారు.

కంచ ఐలయ్య దేశాన్ని, హిందుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని కసిరెడ్డి వెంకట రెడ్డి మండిపడ్డారు. హిందూ సమాజం ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MLC Ramchandra Rao demanded on Saturday that CBI should probe who behind Kancha Ilaiah.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి