Kaleshwaram: కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు..!
లక్షల కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది. మేడిగడ్డ పిలర్లు కుంగడంతో నీరు ఎత్తిపోయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వల్లే నాసిరకంగా నిర్మించారని ఆరోపణలు విస్తున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ దర్యాప్తు జరుపుతోంది. ఈ విచారణలో కాళేశ్వరం లోపాల పుట్ట అని తేలినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంజినీరింగ్ అధికారులు సరైన సమాచారం ఇవ్వట్లేదని తెలుస్తోంది.
కాంగ్రెస్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. రూ.38,500 కోట్ల అంచనాతో పనులు చేపట్టారు.బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రీడిజైన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. 180 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని ప్రణాళిక రచిచింది. రూ.1,27,872 కోట్లతో పనులు మొదలు పెట్టి పూర్తి చేసింది. అయితే ప్రాజెక్టు నిర్మించిన దాదాపు నాలుగేళ్లకే లోపాలు బయటపడ్డాయి.

మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగాయి. దీంతో ఈ విషయం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయంంశంగా మారింది. బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలని రాంమోహన్ రెడ్డి అనే వ్యక్తి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సీబీఐ నుంచి కళ్యాణ్ చక్రవర్తి కౌంటర్ దాఖలు చేశారు. కాళేశ్వరం అవినీతిపై ఇప్పటివరకు తమకు ఫిర్యాదు రాలేదని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి గానీ కాళేశ్వరానికి నిధులు సమకూర్చిన బ్యాంకుల కన్సార్షియం నుంచి గానీ కంప్లెంట్ రాలేదని వివరించారు. తమకు కోర్టు లేదా రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే విచారణ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగానే అవినీతి జరిగితే అరెస్టుల తప్పవని తెలుస్తోంది. కాళేశ్వరం అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తుందో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications