కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గు లేదు , కరోనా రోగులపై కనికరం లేదు : వైఎస్ షర్మిల ధ్వజం
తెలంగాణ సీఎం కేసీఆర్ పై, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీతో పొలిటికల్ ఆరంగేట్రం చేస్తానని ప్రకటించిన వైయస్ రాజశేఖరరెడ్డి తనయ వైయస్ షర్మిల నిప్పులు చెరుగుతున్నారు.సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేసిన షర్మిల, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గు లేదని ధ్వజమెత్తారు.

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేది లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై వైఎస్ షర్మిల తీవ్ర అసహనం
రాష్ట్రంలో కరోనా టెస్టులు లేవని,ఆసుపత్రులలో బెడ్స్ లేవని, పట్టించుకునే డాక్టర్స్ లేరని ధ్వజమెత్తారు.ఇక ఆసుపత్రులలో ఊపిరి నిలిపే ఆక్సిజన్ సిలిండర్లు లేవని ,బతికించే వ్యాక్సిన్ లేదని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేది లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ట్విట్టర్ లో ఈ మేరకు స్పందించిన షర్మిలనిన్నటికి నిన్న జనాలు చస్తూ ఉంటే మీరు ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించటం అవసరమా అని ప్రభుత్వంపై కోర్టు ఘాటుగా స్పందించిందని పేర్కొన్నారు.

కరోనా కట్టడికి మొద్దు నిద్ర వీడాలని పిలుపు
టిఎస్పిఎస్సి లో సభ్యులను నాలుగు వారాల్లోగా నియమించండి లేదంటే టిఎస్పిఎస్సిని మూసేయండి అని కోర్టు తెలంగాణ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. కోర్టులు చెప్తే కానీ వాళ్ల బాధ్యతలు తెలుసుకునేంత మొద్దు నిద్రలో ఈ ప్రభుత్వం ఉందంటూ మండిపడ్డారు. ఇకనైనా మొద్దునిద్ర వీడి కరోనా ని కట్టడి చేయడంతో పాటు టీఎస్పీఎస్సీ సభ్యులను భర్తీ చేసి ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు.

కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చాలని గవర్నర్ తమిళిసై కు లేఖ
అంతకుముందు అప్పుల కుప్పలు కాకముందే కరోనా ను ఆరోగ్యశ్రీలో చేర్చండి అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైయస్ షర్మిల.ఇక ఇదే సమయంలో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కు కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చేలా చూడాలని విజ్ఞప్తి చేస్తూ షర్మిల టీం లేఖ రాసింది.ఇదే విషయాన్ని వారు మీడియా ముఖంగా వెల్లడించారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి స్తోమత లేని పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారుతుందని, కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేరిస్తే అందరికీ వైద్యం అందుతుందని, ఈ మేరకు గవర్నర్ కు లేఖ రాశామని వైయస్ షర్మిల టీం పేర్కొంది. కరోనాతో మరణిస్తున్న జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల భీమా ఇవ్వాలని కూడా వైయస్ షర్మిల టీం డిమాండ్ చేస్తోంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications