కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు కేంద్రం మార్క్ షాక్: ఆ విషయంలో రాష్ట్రానికి మొండిచేయి!!
సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ద్వారా చిన్న పట్టణాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు, ఐటీ ఆధారిత సేవల పరిశ్రమను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక దీని ద్వారా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో చిన్న పట్టణాలలో ఐటీ పరిశ్రమలను విస్తరించడానికి, కొత్త ఉద్యోగాలను కల్పించటానికి నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని చిన్న పట్టణాలకు కనీసం ఒక్క దానికి కూడా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా లో స్థానం దక్కలేదు.

సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాలో తెలంగాణాకు మొండిచెయ్యి
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కొత్తగా ఏర్పాటు చేయనున్న 22 సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ లను పంజాబ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ , ఉత్తర ప్రదేశ్, హర్యానా, గుజరాత్, బీహార్, ఒడిస్సా, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించింది. ఇక ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి స్థానం దక్కలేదు.
దీంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. అడుగడుగున కేంద్రం వివక్ష కొనసాగుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇక కొత్తగా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కులు ఏర్పాటయ్యే రాష్ట్రాల జాబితాలో ఒడిస్సా రాష్ట్రం మినహాయించి మిగతా రాష్ట్రాలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు కావడం గమనార్హం

బీజేపీ పాలిత రాష్ట్రాలకే ఎక్కువగా ఎస్టీపీఐలు
కేంద్ర ప్రభుత్వం చిన్న పట్టణాలకు ఐటీ పరిశ్రమల విస్తరించడానికి, కొత్త ఉద్యోగాల కల్పనకు సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన కేంద్రం అలా కాకుండా బిజెపి పాలిత రాష్ట్రాలకే అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
దేశంలోని 62సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కులను పది రీజియన్ లుగా విభజించగా, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ పరిధిలో కాకినాడ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ సబ్ సెంటర్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం పరంగా చూస్తే హైదరాబాద్ లో ప్రధాన ఎస్టీపీఐతో పాటు వరంగల్ ఎస్టీపీఐ సబ్ సెంటర్ గా ఉంది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఏర్పాటు చెయ్యాలని కేంద్రాన్ని కోరుతున్న రాష్ట్రం
అయితే దేశంలోనే ఐటి రంగంలో అగ్రస్థానం లోకి దూసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్న హైదరాబాద్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా కోరుతోంది. ఇక రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం జిల్లా కేంద్రాలలో ఐటి హబ్ లను ఏర్పాటు చేస్తోంది.
ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం లలో ఐటీ హబ్ ను ఏర్పాటు జరిగి అక్కడ కార్యకలాపాలు కూడా కొనసాగుతున్నాయి. ఇక నిజామాబాద్, మహబూబ్నగర్, సిద్దిపేటలో ఐటి హబ్ ల నిర్మాణం జరుగుతుంది. రామగుండం, నల్లగొండ వనపర్తి లోనూ ఐటీ హబ్ లు నిర్మించడానికి ప్రభుత్వం అనుమతులను జారీ చేసింది.

తెలంగాణా రాష్ట్రానికి కేంద్రం మొండి చెయ్యి .. కెసీఆర్ కు షాక్
ఇక తెలంగాణా మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి, వివిధ కంపెనీల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలో ఎస్టిపిఐ ల ఏర్పాటు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాలలో ఐటీని విస్తరించడం కోసం రాష్ట్రం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, విస్తరించడానికి తెలంగాణ రాష్ట్రంలో అవకాశమున్నా కేంద్రం మాత్రం ఒక పట్టణాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు కేంద్రం తనదైన షాకిచ్చింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications