తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం భారీ గుడ్ న్యూస్..ఇక నుంచి..!!
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. తెలంగాణలో అదనంగా వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నులు (బియ్యం రూపంలో) పెంచేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. సవరించిన వరి కొనుగోలు అంచనాను బియ్యం రూపంలో 43 లక్షల మెట్రిక్ టన్నులు గా కేంద్రం నిర్ణయించింది. దీంతో రైతులకు పెద్ద ఊరట లభించనుంది.
తెలంగాణకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చే సమాచారం అందించింది. రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా వడ్ల కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం సవరించిన వరి కొనుగోలు అంచనాను బియ్యం రూపంలో 43 లక్షల మెట్రిక్ టన్నులు గా నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా తెలంగాణలో రైతులు పండించిన ధాన్యానికి మరింత మార్కెట్ భరోసా లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వాహనాల స్థాన నిర్ధారణ వ్యవస్థ అమలుపై కూడా కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026 సెప్టెంబర్ 30 నాటికి రాష్ట్రంలోని అన్ని అర్హత గల వాహనాల్లో వీఎల్టీఎస్ వ్యవస్థను పూర్తిగా అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.

కేంద్రం నిర్ణయంతో రైతులకు ఊరట
ఈ వ్యవస్థ ద్వారా వాహనాల కదలికలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించే అవకాశం ఉండటంతో భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపడనున్నాయి. పార్లమెంట్ లో మంత్రి పీయూష్ గోయల్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలిశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వడ్ల కొనుగోలు అంచనాను పెంచినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రబీ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధరతో కొనుగోలు జరిగేలా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వ్యవసాయ రంగానికి ఊతమివ్వనుంది. అదనపు కొనుగోళ్లతో రైతులకు ఆర్థిక భరోసా పెరగడంతో పాటు రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ మరింత పక్కాగా కొనసాగేందుకు సహకరిస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications