ఒవైసీ బ్రదర్స్ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ.. కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శలు
న్యూఢిల్లీ : తెలంగాణ సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉద్యమ సమయంలో చెప్పిన అంశాలను కేసీఆర్ మరచిపోయారని దుయ్యబట్టారు. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించేందుకు భయపడుతున్నారని విమర్శించారు. ఎంఐఎం చేతిలో తెలంగాణ సీఎం కీలుబొమ్మలా మారారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. సీఎం కేసీఆర్పై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఆయన తమ్ముడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అంటే కేసీఆర్కు భయమని ధ్వజమెత్తారు. అందుకే తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడం లేదని మండిపడ్డారు.

ఉద్యమ సమయంలో మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని బీరాలు పలికారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ మాట మార్చారని విమర్శించారు. ఒవైసీ సోదరులను తన భుజాలపై కేసీఆర్ కూర్చొబెట్టుకొని ఊరేగుతున్నారని విమర్శించారు. ఎంఐఎం చేతిలో టీఆర్ఎస్ బందీగా మారిందని దుయ్యబట్టారు. కేసీఆర్, ఒవైసీ చేతుల్లో తెలంగాణ రాష్ట్రం బందీ అయ్యిందని మండిపడ్డారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications