హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందుబాటులోకి డిజిటలైజ్డ్ హెల్త్‌కేర్: మంత్రి కెటిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో వైద్య, ఆరోగ్య రంగంలో మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే త్వరలో డిజిటలైజ్డ్ హెల్త్‌కేర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఐటీ, పంచాయతీరాజ్ శాఖమంత్రి కెటి రామారావు తెలిపారు. గురువారం హయత్‌ హోటల్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

డిజిటలైజ్‌డ్ హెల్త్‌కేర్‌లో భాగంగా పౌరుల ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని పొందుపర్చనున్నామని తెలిపారు. ప్రత్యేకమైన ఆధార్ తరహాలో యూనిక్ నంబరు కేటాయించి 3.60 కోట్ల మంది లబ్దిపొందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. వైద్య, ఆరోగ్య రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు.

ప్రపంచవ్యాప్తంగా అభివృద్ది చెందిన దేశాలు సైతం ఈ రంగంలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని, నేడు అంతర్జాతీయ సమస్యగా ఆరోగ్య సంరక్షణ రంగం మారిందని అన్నారు. ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు బలపడాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రభుత్వం తరఫున సహాయ, సహకారాలు ఉంటాయని, పన్ను మినహాయింపు అమలు చేస్తామని చెప్పారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

తెలంగాణలో వైద్య, ఆరోగ్య రంగంలో మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగానే త్వరలో డిజిటలైజ్డ్ హెల్త్‌కేర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఐటీ, పంచాయతీరాజ్ శాఖమంత్రి కెటి రామారావు తెలిపారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

గురువారం హయత్‌ హోటల్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

డిజిటలైజ్‌డ్ హెల్త్‌కేర్‌లో భాగంగా పౌరుల ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని పొందుపర్చనున్నామని తెలిపారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

ప్రత్యేకమైన ఆధార్ తరహాలో యూనిక్ నంబరు కేటాయించి 3.60 కోట్ల మంది లబ్దిపొందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. వైద్య, ఆరోగ్య రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు.

రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగం వెనుకబడి ఉందని, గత కొన్ని సంవత్సరాలుగా తాను ప్రజా ప్రతినిధిగా ఈ విషయం గమనించానని అన్నారు. వైద్య ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తున్నద తెలిపారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 1000 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వెబ్‌క్యాంలను ఏర్పాటు చేసి, ఆధునిక టెక్నాలజీని జోడించి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించనున్నామని చెప్పారు.

రాష్ర్టాభివృద్దిలో ఐటీ, ఏరోస్పేస్-డిఫెన్స్, హెల్త్‌కేర్ రంగాలు కీలకపాత్ర పొషిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో నాస్కాం చైర్‌పర్సన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ వీబీ దేశాయ్, ఇండియన్ రివర్స్ అడ్వయిజర్స్ కార్పొరేషన్ ఎండీ అవినాష్, త్రిపుల్‌ఐడీ డైరెక్టర్ పీజే నారాయణన్, ప్రొఫెసర్ వాసుదేవ వర్మలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

English summary
A Centre for Healthcare Entrepreneurship, aimed at promoting innovation and entrepreneurship in healthcare, was inaugurated at IIT, Hyderabad by Minister for IT and Panchayat Raj, Telangana, K. T. Rama Rao here on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X