కోత వద్దు: నీతి అయోగ్‌లో సిఎం కెసిఆర్(ఫొటో)

భోపాల్: కేంద్ర ప్రభుత్వ పథకాలతో రాష్ట్రాలపై భారం వేయడం తగదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం భోపాల్‌లో జరిగిన నీతి ఆయోగ్ ఉపసంఘం మూడో సమావేశంలో ఆయన మాట్లాడారు.

మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, నాగాలాండ్ సిఎం టిఆర్ జెలియాంగ్, అరుణాచల్‌ప్రదేశ్ సిఎం నాబంటుకీ, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్‌దాస్, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ ఏకే సింగ్ హాజరయ్యారు.

Centre not ‘hostile’ to us: KCR

రాష్ర్టాలలో అమలు చేస్తున్న కేంద్ర పథకాలలో కేంద్రం వాటా 80 శాతానికి తగ్గకుండా ఉండాలని సిఎం కెసిఆర్ అభిప్రాయపడ్డారు. ఐచ్ఛిక పథకాల నిధులలో కోత వేయడం తగదని అన్నారు. ఈ కోతల వల్ల ఆర్థికంగా మిగులు ఉన్న రాష్ర్టాలపై భారం పెరిగిపోతోందని చెప్పారు. ఆర్థిక సంబంధ బాధ్యత, వార్షిక ప్రణాళిక నిర్వహణ చట్టంపై ఎన్నో ఆకాంక్షలున్నాయని కేసీఆర్ అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిపాదనలను మిగతా సభ్యులు కూడా సమర్థించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు తమ అవసరాలకు అనుగుణంగా సరళంగా వినియోగించుకునేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలలో కేంద్రం వాటా 50 శాతానికి తగ్గకూడదన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+