Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణా ఎన్నికలలో ఇప్పటివరకు పట్టుబడిన నగదు; పోలింగ్ ఏర్పాట్లపై సిఈఓ వికాస్ రాజ్

తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 13వ తేదీన జరగనున్న లోక్​సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​రాజ్​ తెలిపారు. రాష్ట్రంలో 3.32కోట్ల మంది ఓటుహక్కు వినియోగానికి వీలుగా 35,808పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నేడు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల ప్రచారం ఈరోజుతో పూర్తికావటంతో తదుపరి ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు తెలిపారు.

13నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల పరిధిలో పోలింగ్ సమయం మార్పు
రేపు ఉదయం నుంచి పోల్ టీంలు బయలుదేరుతాయన్నారు. మే 13వ తేదీన ఉదయం 5.30గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. పోలింగ్ నాడు 13నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల పరిధిలో మినహా పోలింగ్ ఉదయం 7నుండి 6గంటల వరకు జరుగుతుందన్నారు. మారుమూల ప్రాంతాల్లోని మూడు పోలింగ్‌ కేంద్రాల్లో 10,12,14 మంది ఓటర్లు ఉండగా, 13 పోలింగ్‌ కేంద్రాల్లో 25మందిలోపు ఓటర్లు, 23పోలింగ్‌ కేంద్రాల్లో 50లోపు ఓటర్లు ఉన్నారని తెలిపారు.

CEO Vikas Raj on polling arrangements and said details of Cash seized so far in Telangana elections

9900 పోలింగ్‌ కేంద్రాలను క్రిటికల్‌గా గుర్తించిన ఈసీ
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9900 పోలింగ్‌ కేంద్రాలను క్రిటికల్‌గా గుర్తించామని అక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 12 వేల మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ చేస్తున్నట్టు వెల్లడించారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ పూర్తి కానుందని తెలిపారు.

320 కోట్ల రూపాయల నగదు, ఉచితాలను స్వాధీనం
ఎన్నికల పోలింగ్ క్రమంలో రాష్ట్రంలో మొత్తం 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని, దీని కారణంగా నలుగురి కంటే ఎక్కువ మంది కలిసి ఉండరాదని, ఎన్నికల మెటీరియల్ మరియు ఎన్నికలకు సంబంధించిన బల్క్ ఎస్‌ఎంఎస్‌లను ప్రదర్శించడం పూర్తిగా నిషేధించబడిందని CEO తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు మొత్తం సుమారు 320 కోట్ల రూపాయల నగదు, ఉచితాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

పోలింగ్ విధుల్లో లక్షా 90 మంది సిబ్బంది
లక్షా 90 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటారని, 161 కంపెనీల కేంద్ర సాయుధ దళాలు మరియు పారా మిలిటరీ బలగాలతో పాటు మొత్తం 70 వేల మంది సిబ్బందిని ఎన్నికల విధులకు కేటాయించినట్లు తెలిపారు. అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు బ్యాలెట్ యూనిట్లలో ప్రదర్శించబడే అభ్యర్థుల క్రమాన్ని తనిఖీ చేయాలని, సరైన వారిని ఎంపిక చేసుకోవాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

20 వేల మంది ఓటర్లు హోం వోటింగ్
పోలింగ్ స్టేషన్ వివరాలను తెలుసుకునేందుకు 1950లో ఎస్‌ఎంఎస్‌ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో అన్నికి మౌలిక వసతులను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు 20 వేల మంది ఓటర్లు హోం వోటింగ్ వేశారన్నారు. గతేడాది నవంబరులో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన కేంద్రాల్లోనే ఓటు వేయవేచ్చని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+