పవన్ కల్యాణ్ గోడ మీది పిల్లి: చాడ వెంకటరెడ్డి వ్యాఖ్య

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రజల కష్టాలు ఏమిటో సినీ హీరో, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు తెలియదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. జనసేన పార్టీ ద్వంద్వ వైఖరని అవలంభిస్తోందని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో పవన్ క‌ల్యాణ్‌ పాల్గొనలేదని, ఆయనకు ప్రజల కష్టాలు ఎలా ఉంటాయో తెలియదని చాడ వెంకటరెడ్డి బుధవారం మీడియా ప్రతినిదుల సమావేశంలో అన్నారు. పవన్ గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

chada Venkat Reddy says Pawan Kalyan is playing double role

తెలంగాణ ప్రభుత్వంపై కూడా చాడ వెంకటరెడ్డి విమర్శలు చేశారు. నిరంతర విద్యుత్ అందిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదమని ఆయన అన్నారు.

చత్తీసగఢ్ నుంచి ఒక్కో యూనిట్ రూ.5 చొప్పున కొనుగోలు చేసి తీసుకొస్తున్నామని రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ నెలకు రూ.రెండు వేల కోట్ల అదనపు భారం మోపుతున్నారని అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
CPI leadeer Chada Venakat Reddy criticised that Jana Sna chief Pawan Klayan was following double standards.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి