ఆగని చైన్ స్నాచింగ్‌లు: మరో రెండు చోట్ల గొలుసు చోరీలు

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరో రెండు చోట్ల చైన్ స్నాచింగ్‌లు చోటుచేసుకున్నాయి. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి ఆగమయ్య నగర్‌లో నివాసముండే వరలక్ష్మి(40) బుధవారం రాత్రి రోడ్డు పక్కన నడుస్తూ వెళ్తుండగా వెనుక నుంచి బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధి సత్తిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న సంగీత(35) తన పిల్లలను స్కూల్ నుంచి తీసుకొని వస్తుండగా, బ్లాక్ పల్సర్ పై వచ్చిన ఇద్దరి వ్యక్తులు మెడలో ఉన్న పుస్తులతాడును తెంపుకొని పారిపోయారు. ఈ ఘటనలో సంగీత మెడకు గాయలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Chain-snatchers strike at 2 places in Hyderabad

మంగళవారం హైదరాబాదులో 11 చోట్ల చైన్ స్నాచింగ్‌లు జరిగిన నేపథ్యంలో పోలీసులు ముఠాను పట్టుకోవడానికి గస్తీ ఏర్పాటు చేశారు. ఈ గస్తీ జరుగుతున్న సమయంలోనే మరో రెండు చోట్ల చైన్ స్నాచింగ్‌ సంఘటనలు జరగడం కలకలం సృష్టిస్తోంది.

ముఠాను పట్టుకునే విషయంలో తాము ముంబై పోలీసులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని పోలీసులు చెప్పారు. మహరాష్ట్ర, కర్ణాటకలకు ప్రత్యేక బృందాలను పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+