వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ అనుచరులకే టీఎస్పీఎస్సి లో ఛాన్స్.!అడ్డగోలుగా దండుకుంటున్న ఆసుపత్రులపై చర్యలు ఏవన్న శ్రవణ్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు తొత్తులుగా వ్యవహరించే వారికే టీఎస్పీఎస్సి లో పదవులొచ్చాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు. టీఎస్పీఎస్సీ బోర్డు మెంబర్స్, ఛైర్మెన్ ను నియమించడం సంతోషించదగ్గ అంశం అయినప్పటికి వారి పనితీరుపై సీఎం ప్రభావం ఉంటుందనే సందేహాన్ని శ్రవణ్ వ్యక్తం చేసారు.

కొత్తగా కొలువుతీరిన బోర్డ్ వారం రోజుల్లో 50 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ లు ఇవ్వాలని, రాష్ట్రంలో ఖాళీలన్నీ భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగాలను కూడా వెంటనే రెగ్యూలర్ చేయాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేసారు. ఉద్యోగాల భర్తీలో కొత్తగా ఎంపికయిన బోర్డ్ చైర్మన్ మరియు సభ్యులు పారదర్శకత పాటించాలని శ్రవణ్ సూచించారు.

Chance Given to KCR Followers in TSPSC.!Dasoju Sravan Fires on T sarkar.!

ఇదిలా ఉండగా కరోనాను ఆరోగ్య శ్రీ లో చేరుస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాత్రికిరాత్రే ఆయుష్మాన్ భారత్ లో చేర్చడానికి కారణాలేంటని శ్రవణ్ ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్ లో చేర్చడం మంచిదే కానీ ఆలస్యం ఎందుకైందన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 26 లక్షల మంది లబ్దిపొందుతారని, అదే ఆరోగ్య శ్రీ ఐతే 77 లక్షల మంది లబ్దిపొందే అవకాశం ఉండేదని చెప్పారు.

మరి ఇప్పుడు మిగతా 51 లక్షల మందికి, హెల్త్ కార్డులు వున్న వారికి ఎలా న్యాయం చెస్తారో సీఎం స్పష్టత ఇవ్వాలని అన్నారు. 2014 ఎన్నికల్లో ప్రతి జిల్లాలో నిమ్స్ స్థాయి హాస్పిటల్ ఏర్పాటు చేస్తామన్న వాగ్దానం ఏమైందని శ్రవణ్ ప్రశ్నించారు. సెకండ్ వేవ్, బ్లాక్ ఫంగస్ తో పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారని, మానవ సేవే మాధవ సేవ అని గుర్తించి హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. అడ్డగోలుగా దండుకకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని శ్రవణ్ డమాండ్ చేసారు. 245 జీవో ప్రకారం మాస్క్ లేకుంటే ఫైన్ లు వేసిన పోలీసులు అదే జీవో ప్రకారం ప్రైవేట్ హాస్పిటల్స్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనకనిరు శ్రవన్. సినిమా థియేటర్స్ కూడా ఐసోలేషన్ సెంటర్లుగా మార్చాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేసారు.

English summary
Newly acquired TSPSC board to give notifications of 50,000 jobs on weekdays, Dasoju Shravan demanded that all vacancies in the state be filled and contract jobs be regularized immediately.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X