తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడు ఖరారు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఏపీ టీడీపీకి నూతన అధ్యక్షుడిని నియమించిన చంద్రబాబు..ఇప్పుడు తెలంగాణకు కొత్త అధ్యక్షుడి నియామకం పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బీసీ వర్గానికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావటంలో తెలంగాణ టీడీపీకి చెందిన ఇద్దరు నేతల కు టీటీడీలో సభ్యత్వం ఇచ్చేందుకు సిద్దమైనట్లు సమాచారం.

చంద్రబాబు కసరత్తు
తెలంగాణలో పార్టీ బలోపేతం దిశగా చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసారు. ఏపీలో బీజేపీ, జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చిన టీడీపీ తెలంగాణలోనూ బలం చాటుకొనే ప్రయత్నం చేస్తోంది. గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉంది. కొద్ది నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ, జనసేన పొత్తు తెలంగాణలోనూ కొనసాగుతుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. టీడీపీ తమ బలం పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది.

Chandra Babu to announce new president for Telangana TDP

నూతన అధ్యక్షుడు
అందులో భాగంగా తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడి నియామకం పైన చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. లంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బీసీ సామాజికవర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్ కు పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. రెండు రోజుల క్రితం అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబును అరవింద్ కుమార్ గౌడ్ కలిసారు. ఆ సమయంలోనే పార్టీ బాధ్యతల పైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అరవింద్ కుమార్ గౌడ్ ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఉన్నారు.

టీటీడీపీకి ప్రాధాన్యత
టీడీపీలో కీలక పదవులు నిర్వహించిన ఉమ్మడి ఏపీ మాజీ హోం మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ కు మేనట్లుడు. గతంలో అరవింద్ కుమార్ గౌడ్ ఆసిఫ్ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి వీడారు. టీడీపీ కష్టాల్లో ఉన్న సమయంలోనూ పార్టీలోనే కొనసాగారు. పార్టీ వాయిస్ బలంగా వినిపించే నేతగా పేరుంది. దీంతో, ఈ పరిస్థితుల్లో అరవింద్ కుమార్ గౌడ్ కే పార్టీ పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు పార్టీ లో చర్చ జరుగుతోంది. అదే విధంగా పార్టీ సభల్లో ఆకర్షనీయ ప్రసంగాలు చేసే నర్సిరెడ్డి తో పాటుగా మాజీ ఎమ్మెల్యేకు టీటీడీలో సభ్యత్వం దక్కనుందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+