రాహుల్ తో చంద్ర‌బాబు ప్ర‌చారం..!తొలివిడ‌త‌గా ఖ‌మ్మం, హైద‌రాబాద్ లో మీటింగ్స్..!!

హైదరాబాద్ : ముంద‌స్తు ఎన్నిక‌లు ఎన్నో చారిత్య్ర‌ క అంశాల‌కు గీటురాయిగా నిలుస్తోంది. బ‌ద్ద శ‌త్రువులుగా ఉన్న కాంగ్రెస్, టీడిపిల‌ను ఏకం చేసిన ఘ‌న‌త తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కే ద‌క్కుంతుంది. అంతే కాకుండా ఎప్పుడూ ఊహించ‌ని, ఎక్క‌డా చూడని అరుదైన ద్రుశ్యాల‌ను కూడా ఈ ఎన్నిక‌ల్లో చూడ‌బోతున్నాము. ఏఐసీసీ అద్య‌క్షుడు రాహుల్ గాంధీ, టీడిపి జాతీయ అద్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు ఒకే వేదిక మీద క‌నిపించ‌బోతున్నారు. అందుకు తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాలు వేదిక కాబోతున్నాయి.

 అరుదైన ఘ‌ట్టాలు న‌మోదు చేస్తున్న ముంద‌స్తు ఎన్నిక‌లు..! ఒకే వేదిక‌పై బాబు, రాహుల్..!!

అరుదైన ఘ‌ట్టాలు న‌మోదు చేస్తున్న ముంద‌స్తు ఎన్నిక‌లు..! ఒకే వేదిక‌పై బాబు, రాహుల్..!!

రాష్ట్రంలో అన్ని వర్గాల ఓట్ల కోసం మహాకూటమి నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఇటు రాహుల్ తో పాటు చంద్రబాబు నాయుడు తో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీన ఖమ్మంతో పాటు హైదరాబాద్ నగంరంలో చంద్రబాబు ప్రచార షెడ్యూల్ ఖరారైంది. నగర శివారు నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. దాంతో ఆ నియోజకవర్గాల్లో ఓట్లను పొందేందుకు ప్రత్యేకంగా సభలు నిర్వహిస్తున్నారు.

గ్రేటర్ లో రాహుల్, బాబు ప‌ర్య‌ట‌న‌..! అమీర్ పేట‌, నాంప‌ల్లిలో రోడ్ షోలు..!!

గ్రేటర్ లో రాహుల్, బాబు ప‌ర్య‌ట‌న‌..! అమీర్ పేట‌, నాంప‌ల్లిలో రోడ్ షోలు..!!

ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండు సార్లు ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొనగా, మళ్లీ బుధవారం రాహుల్‌గాంధీ, చంద్రబాబునాయుడు తో కలిసి నిర్వహించే సభల్లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్‌లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతో అందరి ఓట్లను రాబట్టుకునేందుకు ఇటు రాహుల్‌ తో పాటు ఆటు చంద్రబాబునాయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తదితరులు భారీ ఎత్తున ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఖ‌మ్మం నుండి నేరుగా హైద‌రాబాద్ కు బాబు, రాహుల్..! క‌లిసి ప్ర‌సంగించ‌నున్న నేత‌లు..!!

ఖ‌మ్మం నుండి నేరుగా హైద‌రాబాద్ కు బాబు, రాహుల్..! క‌లిసి ప్ర‌సంగించ‌నున్న నేత‌లు..!!

గ్రేటర్‌ హైదరాబాద్ లోనే 24 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాహుల్, చంద్రబాబు షెడ్యూల్ బుధవారం (28వ తేదీ) మధ్యాహ్నం రెండు గంటలకు ఖమ్మం చేరుకుంటున్న చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి చేరుకుంటారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ ముగించుకున్న తరువాత అక్కడి నుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి సాయంత్రం 5.15 కు చేరుకుంటారు.

బాబు ప్ర‌సంగాల‌పై ఉత్కంఠ‌..! రాహుల్ ఏంచెప్ప‌బోతున్నారు..!!

బాబు ప్ర‌సంగాల‌పై ఉత్కంఠ‌..! రాహుల్ ఏంచెప్ప‌బోతున్నారు..!!

సాయంత్రం 5.30 కి అమీర్ పేట సత్యం థియేటర్ సర్కిల్ లో రాహుల్ తో కలిసి ప్రసంగిస్తారు. రాత్రి 6.45 కి నాంపల్లి బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన తరువాత జూబ్లిహిల్స్ లోని నివాసానికి చేరుకుంటారు. సభ ముగిసిన తరువాత రాహుల్ గాంధీ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే కోటి దీపోత్సవంలో పాల్గొననున్నారు. 29న ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు నగరంలో ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు నిర్వహించే సమావేశానికి హాజరు కానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+