టిక్కెట్ ఎవరికివ్వాలో నాకు తెలుసు: రమణకు బాబు క్లాస్, బ్రాహ్మణి రాజకీయ ఆరంగేట్రంపై..

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణకు, ఇతర కొందరు నేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం క్లాస్ తీసుకున్నారు. తెలంగాణలో సమస్యలపై సీరియస్‌గా పోరాటం చేయాలన్నారు.

మెతకగా ఉంటే కదరదని, అలసత్వం చేయవద్దని హితవు పలికారు. గ్రూప్ రాజకీయాలు మానివేసి అందరినీ కలుపుకొని పోవాలని సూచించారు. ఎవరికి సీట్లు ఇవ్వాలో నాకు తెలుసునని చెప్పారు. జాబితాను కూడా సిద్ధం చేశానన్నారు. ముందే టిక్కెట్లను ప్రకటిస్తానని చంద్రబాబు చెప్పారు. మహానాడు తర్వాత మళ్లీ వస్తానని తెలిపారు.

Chandrababu class to L ramana, clarifed about Brahmani political entry

నారా బ్రాహ్మణి రాజకీయ ప్రవేశంపై చంద్రబాబు

నారా బ్రాహ్మణి రాజకీయ రంగ ప్రవేశంపై చంద్రబాబు స్పందించారు. బ్రాహ్మణీ రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణలో పార్టీ బాధ్యతలను తీసుకోవాలని కొందరు తెలంగాణ టీడీపీ నేతలు కోరారు. దీంతో బ్రాహ్మణి రాజకీయ రంగ ప్రవేశంపై చంద్రబాబు తేల్చి చెప్పారు. ఆమెకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదన్నారు.

Recommended Video

    గాలి ఫ్యామిలీకే దక్కిన MLC టిక్కెట్

    కాగా నారా బ్రాహ్మణి హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల స్విట్జర్లాండులో దావోస్‌లో పారిశ్రామికవేత్తల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఆమె హెరిటేజ్ తరఫున వెళ్లారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+