జగన్‌పై కేసు ఎందుకు పెట్టలేదు, బాబుకు అంత ధైర్యం ఉందా?: 'కాపు'పై మందకృష్ణ
హైదరాబాద్: కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పడంపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ శుక్రవారం నాడు మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం ఇస్తామంటున్న కాపు రిజర్వేషన్లపై ఆయన నిలదీశారు.
తొమ్మిది నెలల్లో జస్టిస్ మంజునాథ కమిషన్ నివేదిక ఇస్తుందని, తర్వాత రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోందని, అయితే, కేంద్రం మద్దతు లేకుండా ఈ రిజర్వేషన్లు అమలు చేసే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు.

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అందువల్లే ఆందోళనలు, నిరసనలు పెద్ద ఎత్తున చెలరేగుతున్నాయన్నారు. తుని విధ్వంసం ఘటనలో వైసిపి అధినేత జగన్ పాత్ర ఉందని చెబుతున్న ప్రభుత్వం ఆయనపై కేసు ఎందుకు నమోదు చేయలేదన్నారు.
కాగా, మందకృష్ణ మాదిగ గతంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. చంద్రబాబు వస్తున్నా మీకోసం పేరుతో తెలంగాణలో పాదయాత్ర చేసినప్పుడు టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే, టిఆర్ఎస్ వారిని ఎమ్మార్పీఎస్ అడ్డుకొని చంద్రబాబుకు అండగా నిలిచింది.












Click it and Unblock the Notifications