జీర్ణించుకోలేకపోతున్నా, కుండబద్దలు కొట్టేవారు: దాసరికి బాబు నివాళి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఫిలిం చాంబర్‌లో దాసరి నారాయణ రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దాసరి మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఫిలిం చాంబర్‌లో దాసరి నారాయణ రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దాసరి మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు.
తెలుగు జాతికి, చిత్ర పరిశ్రమకు ఆయన మృతి తీరని లోటు అన్నారు. దాసరి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. తెలుగువారి గుండెల్లో దాసరి ఎప్పటికీ నిలిచిపోతారన్నారు.
పాలకొల్లులో పుట్టి, అత్యంత విశ్వాసంతో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి అన్నారు. ఎప్పుడు బడుగు, బలహీన వర్గాల కోసం ఉద్యమించారని చెప్పారు. సినిమాలు కూడా సమాజం కోణంలోనే ఉంటాయని అభిప్రాయపడ్డారు.

ఏ విషయమైనా కుండబద్దలు కొట్టే వ్యక్తి అన్నారు. ఎక్కడా రాజీపడలేదన్నారు. తనకు చిన్నప్పటి నుంచి పరిచయం అని చెప్పారు. దాసరితో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. తమ కుటుంబంతో సన్నిహితంగా ఉండేవాడన్నారు.
నేను అంటే దాసరికి అభిమానం అన్నారు. సొంత కుటుంబ సభ్యులుగా ఉండేవాళ్లమన్నారు. ఆయన విలువల కోసం పోరాడారన్నారు. దాసరి ఓ వ్యక్తి కాదని, వ్యవస్థ అన్నారు. దాసరి సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారన్నారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications