మోడీతో మాట్లాడుతా, అమెరికాలో మార్పులొచ్చాయా: శ్రీనివాస్ భార్య సునయనతో బాబు
తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య అనంతరం అమెరికాలోని తెలుగు వారు అభద్రతాభావంతో గడుపుతున్నారని, వారికి అండగా నిలిచి మానసిక స్థైర్యాన్ని ఇచ్చి కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు వారందరిపై ఉందని ఏపీ సీఎ
హైదరాబాద్: తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య అనంతరం అమెరికాలోని తెలుగు వారు అభద్రతాభావంతో గడుపుతున్నారని, వారికి అండగా నిలిచి మానసిక స్థైర్యాన్ని ఇచ్చి కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు వారందరిపై ఉందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
అమెరికాలో ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలపై ప్రధానమంత్రితో మాట్లాడుతానని, అమెరికా సానుకూలంగా స్పందించి, అక్కడ హత్యలు ఆగేంత వరకు కేంద్రం ఒత్తిడి తీసుకు రావాలన్నారు.
అమెరికాలోని కాన్సాస్ గత నెల 24న జరిగిన జాత్యాహంకార దాడిలో మృతి చెందిన కూచిభొట్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను చంద్రబాబు శనివారం పరామర్శించారు. హైదరాబాద్ బౌరంపేటలోని శ్రీనివాస్ ఇంటికి వెళ్లి, అరగంటకు పైగా శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో గడిపారు.

మోడీతో మాట్లాడుతా
అమెరికాలోని భారతీయులందరికీ కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని, దీనిపై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చిస్తామని ఏపీసీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కూచిభొట్ల శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోవడంతో బౌరంపేటలో నివాసం ఉంటున్న ఆయన కుటుంబసభ్యులను చంద్రబాబు పరామర్శించి అనంతరం మాట్లాడారు.

సునయ నుంచి ఆరా
శ్రీనివాస్ భార్య సునయన, తల్లిదండ్రులు మధుసూదన్, వర్ధినిలకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత భారతీయుల పట్ల విద్వేషాలు, దాడులు పెరిగాయా, పనిచేసే కార్యాలయాల్లో మార్పులేమైనా చోటుచేసుకున్నాయా అని సునయనను ఆరా తీశారు.

తండ్రి ఆవేదన
ఇలాంటివి ఉన్నట్లు శ్రీనివాస్ తనకెప్పుడూ చెప్పలేదని ఆమె చంద్రబాబుతో చెప్పారు. శ్రీనివాస్ తండ్రి మధుసూదన్ మాట్లాడుతూ.. పిల్లలు ఉన్నత స్థానాలకు చేరుకొనే సమయంలో ఇలా జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

రెచ్చగొట్టే నాయకులతో ఇలాగే..
కులమతాలు, జాతి విద్వేషాలను రెచ్చగొట్టే నాయకులతో ఇలాంటివి జరుగుతాయని చంద్రబాబు వారితో అన్నారు. శ్రీనివాస్ హత్యతో అమెరికాలోని భారతీయులందరూ అభద్రత, ఆందోళనకు గురవుతున్నారన్నారు.

పునరావృతం కావొద్దు
ఇలాంటి ఘటనలు పునరావృతమవకుండా చూస్తానని అమెరికా స్పష్టం చేసేవరకు అందరూ సమష్టిగా పని చేయాలని చంద్రబాబు అన్నారు. అమెరికాలో ఉన్న అవకాశాలు మనదేశంలోనూ కల్పించాలన్నారు.

అపాయింటుమెంట్ ఇప్పిస్తా
తమకు జరిగిన అన్యాయం మరోకుటుంబానికి జరగకుండా చూడాలని శ్రీనివాస్ కుటుంబం కోరిందని చంద్రబాబు అన్నారు. ప్రధానమంత్రి మోడీతో శ్రీనివాస్ కుటుంబసభ్యులకు అపాయింట్‌మెంట్ ఇప్పిస్తామన్నారు.

శివశంకర్ కుటుంబ సభ్యులకూ పరామర్శ
కేంద్ర మంత్రి సుజనా చౌదరి, టిడిపి తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, నేతలు పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఇటీవల మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి శివశంకర్ కుటుంబసభ్యులను కూడా చంద్రబాబు పరామర్శించారు.
-
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications