కేసీఆర్ వర్సెస్ బాబు: చిక్కు ఎవరికి, ఎవరు నిరూపిస్తారు? ఇదీ నిబంధన

హైదరాబాద్: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రాజేస్తోంది. కేసీఆర్ ఒకడుగు వేస్తే, మేం వంద అడుగులు వేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. ఫోన్ ట్యాపింగ్ వంటి పెద్ద నేరానికి కేసీఆర్ ప్రభుత్వం పాల్పడిందని ఏపీ టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు.

ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చా లేదా అనే చర్చ సాగుతోంది. అవినీతి విషయంలో ఫోన్ ట్యాప్ చేసే విషయంలో ఆంక్షలు లేవని అంటున్నారు. అవినీతి అంశం పరంగా ఫోన్ ట్యాపింగ్ తప్పులేదని, కానీ కేంద్ర హోం సెక్రటరీ అనుమతి తప్పనిసరి అని చెబుతున్నారు. ఫోన్లు చట్టవిరుద్ధంగా ట్రాప్ చేశారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది.

విచారణలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ తప్పనిసరి. అయితే, పోన్ ట్యాపింగ్ ఓ వ్యక్తి వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. పలు విచారణ సంస్థలు గతంలో సమాచారం కోసం అనుమతితో ఫోన్ ట్యాపింగ్ చేశాయి.

Chandrababu Naidu vs KCR: The right to tapping telephones in corruptioncases

వన్ ఇండియాతో ఓ సీబీఐ అధికారి మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం వెళ్తే ఫోన్ ట్యాపింగ్ చట్ట విరుద్ధం కాదని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కోసం నిబంధనలు ఉన్నాయని చెప్పారు. యూనియన్ హోం సెక్రటరీ నుండి అనుమతులు అవసరమని చెప్పారు.

యూనియన్ హోం సెక్రటరీ నుండి అనుమతులు వస్తే విచారణ కోసం ఫోన్ ట్యాప్ చేయవచ్చునని చెప్పారు. అవినీతి కేసులో ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్పు కాదన్నారు. అవినీతి భారత ఆర్థిక వ్యవస్థకు దెబ్బ.

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల రగడ విషయంలో ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ తారాస్థాయికి చేరింది. వీరి విషయంలో ఇప్పుడు తేలాల్సింది.. హోంమంత్రిత్వ శాఖ యొక్క అనుమతి లభించిందా లేదా అనే కోణంలోనే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకవేళ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఫోన్ ట్యాపింగ్ కోసం అనుమతులు తీసుకోలేదని, చట్ట విరుద్ధమని నిరూపిస్తే తెలంగాణ రాష్ట్ర హోంసెక్రటరీకి చిక్కులేనని అంటున్నారు. అదే సమయంలో, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుండి తెలంగాణ అనుమతి తీసుకున్నదని తేలితో మాత్రం ఫోన్ ట్యాపింగ్ ఆధారాలను చంద్రబాబుకు వ్యతిరేకంగా కోర్టులో ప్రవేశ పెట్టవచ్చునని చెబుతున్నారు.

ఫోన్ ట్యాపింగ్ ఆవశ్యకతను తెలంగాణ ప్రభుత్వం ప్రూవ్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అలాకాకున్నా, కేంద్ర హోంశాఖ నుండి పదిహేను రోజుల్లో అనుమతులు తీసుకుంటామని సర్వీస్ ప్రొవైడర్లకు రాసిన లేఖను తెలంగాణ ప్రభుత్వం చూపించవలసి ఉంటుందని చెబుతున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కోసం నిబంధనలు ఉన్నాయి

ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం హోం సెక్రెటరీ లేదా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత సంస్థ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం బలమైన కారణాలు చూపించవలసి ఉంటుంది. ఓసారి అనుమతి ఇస్తే రెండు నెలల వరకు ఉంటుంది. కేంద్ర హోంశాఖ దీనిని ఆరు నెలల వరకు పొడిగించవచ్చు. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలను రెండు నెలలే వాడాలి. రెండు నెలల తర్వాత అవి ఉండకూడదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+