తెలంగాణలో ప్రత్యేక మహానాడు, హాజరుకానున్న ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం మహానాడుకు సిద్ధమయింది. బుధవారం (24వ తేదీ) నిర్వహిస్తున్న ఈ తెలుగుదేశం పండుగకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు.
హైదరాబాద్: హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం మహానాడుకు సిద్ధమయింది. బుధవారం (24వ తేదీ) నిర్వహిస్తున్న ఈ తెలుగుదేశం పండుగకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు.
ఈ నెల 27, 28, 29 తేదీలలో టిడిపి మహానాడును విశాఖపట్నంలో నిర్వహిస్తోంది. మహానాడుకు ముందు వివిధ జిల్లాల్లో మినీ మహానాడులు నిర్వహిస్తారు. ఏపీ, తెలంగాణలలో నిర్వహిస్తున్నారు.

అయితే, విభజన నేపథ్యంలో తెలంగాణలో ప్రత్యేకంగా మహానాడు నిర్వహించాలని తెలంగాణ టిడిపి నేతలు నిర్ణయించారు. దీంతో ఈ రోజు (బుధవారం) కార్యక్రమం ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications