Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'పిరికిపందవు.. కేసీఆర్ అంటే గజగజ, నీవల్ల 20మంది ఎన్టీఆర్ మనుషులు పోయారు'

హైదరాబాద్: ఏపీలో మహానాడు జరుగుతున్నవేళ.. ఆ పార్టీ తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు అధినేత చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు ఎంతటి కలకలం రేపాయో తెలిసిందే. ఆపై ఆయనపై వేటు పడ్డ విమర్శల విషయంలో ఆయన వెనక్కి తగ్గడం లేదు. వరుసగా రెండో రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబు దుమ్ము దులిపారు. చంద్రబాబు లాంటి నయవంచకుడు, నీతిమాలిన రాజకీయ నాయకుడు ప్రపంచంలో ఇంకొకరు లేరని విమర్శించారు. ఆయనో నరహంతకుడు అని మండిపడ్డారు.

Recommended Video

    ఏపీ సీఎం చంద్రబాబుపై మోత్కుపల్లి ధ్వజం
    సీబీఐతోనే నీ బండారం బయటపడుతుంది:

    సీబీఐతోనే నీ బండారం బయటపడుతుంది:

    చంద్రబాబుపై కోర్టుల్లో స్టే ఉన్న కేసులను మళ్లీ తెరవాలని, వాటిపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేంద్రం విచారణ జరిపిస్తే సత్యహరిశ్చంద్రుడి తమ్ముడినని చెప్పుకునే బాబు అసలు బండారమేంటో బయటపడుతుందన్నారు.

    'నువ్వో దుర్మార్గుడివి, పాపాత్ముడివి, దుష్టుడివి.. అయినప్పటికీ ఎన్టీఆర్ పెట్టిన జెండా కోసం నీతోనే ఉండాలనుకున్నా. 2009లో నన్ను చంపేస్తారని పదేపదే నాకు ఫోన్ చేసిన నువ్వు.. ఇప్పుడు మాత్రం ఎందుకు చేయడం లేదు?.. నువ్వు నన్ను సస్పెండ్‌ చేసేదేంది? తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిన్ను సస్పెండ్‌ చేశారు' అని మోత్కుపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

    గాలిని వేధించి చంపావ్..:

    గాలిని వేధించి చంపావ్..:


    'రాజకీయాల్లో నీ అంత నీతిమాలిన వ్యక్తి ఈ దునియాలో లేడు. నీ జీవితమే కుట్రలకు, మోసాలకు నిలయం. ఎన్టీఆర్‌ మనుషులు 20 మంది నీ బాధకు చనిపోయారు. చంద్రబాబు వేధించడం వల్లే ముద్దుకృష్ణమ నాయుడు చనిపోయాడు.' అని మోత్కుపల్లి ఆరోపించారు.

    ఆత్మను అమ్ముకుని బతికే నీచుడు చంద్రబాబు అని ఎన్టీఆర్‌ ఆనాడే చెప్పారు. 'గవర్నర్‌ ఎలాగూ రాదు కాబట్టి ఆ పదవి ఇస్తానన్నావు. నిన్ను నేను పదవి అడిగానా?.. అసలు నీ దగ్గర ఆశించినదేంటి? గవర్నర్ పదవి ఇవ్వడానికి నువ్వేమైనా ప్రధానివా?.. రాజ్య సభ సీటు ఇస్తానని చెప్పి నీ బంధువైన గరిపాటి మోహన్ రావుకు అమ్ముకున్నావు.' అని ఫైర్ అయ్యారు.

     పిరికిపందవు.. కేసీఆర్ అంటే గజగజ:

    పిరికిపందవు.. కేసీఆర్ అంటే గజగజ:

    'నేను లేకపోతే ఇంట్లోంచి బయటకు రాని పిరికిపందవు నువ్వు. పనికిమాలిన నాయకులతో నన్ను తిట్టిస్తున్నవ్‌. మగాడివైతే నేరుగా నాతో నువ్వు మాట్లాడు. మోడీ దగ్గరికెళ్లి అరుణ్‌జైట్లీ, కేసీఆర్‌ కాళ్లు పట్టుకోలేదా? కేసీఆర్‌ గురించి మాట్లాడాలంటే గజగజ వణుకుతున్నవ్‌. పదేళ్లు ఇక్కడే ఉండి పార్టీని కాపాడతానని చెప్పిన నువ్వు అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా సర్దుకుని పోయినవ్‌. నువ్వు పోయింది అమరావతి కోసం కాదు. కేసీఆర్‌ ఒక్క లాత్‌ కొడితే అక్కడ పడ్డవ్‌. తెలంగాణలో పార్టీని సర్వనాశం చేసినవ్‌. నా మీద ఏమైనా మాట్లాడితే పురుగులు పడి చస్తవ్‌. నేనెవరికీ అన్యాయం చేయలే. నువ్వు నాకు అన్యాయం చేసినవ్‌. సిగ్గు లేదా నీకు. నువ్వు కులగజ్జి ఉన్నోడివి. రేవంత్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు నేను మాదిగ వ్యక్తినని నా మీద చర్యలు తీసుకుంటవా?' అని మోత్కుపల్లి తీవ్ర విమర్శలు చేశారు.

    ఇన్ని చేసినోడివి అదెందుకు చేయలేదు?:

    ఇన్ని చేసినోడివి అదెందుకు చేయలేదు?:

    'మాట్లాడితే వాజ్‌పేయిని ప్రధాని నేనే చేసిన అంటడు. మోడీని నేనే చేసిన అంటడు. అబ్దుల్‌కలాంను రాష్ట్రపతిని నేనే చేసినా అంటడు. సిగ్గు లేదా నీకు? ఇన్ని చేసినోడివి ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు తీసుకురాలేదు?' అని మోత్కపల్లి ప్రశ్నించారు. బాబు వల్లే రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని, ఎన్నికలలో చంద్రబాబు నాయకత్వంలో పెట్టినంత ఖర్చు ఏ నాయకుడి ఆధ్వర్యంలో పెట్టలేదని ఆరోపించారు. సింగపూర్, దుబాయి, అమెరికాల్లో నువ్వు ఎన్ని కోట్లు దాస్తున్నావో తెలియదా? అని విమర్శించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+