దాసరితో పాత విషయాలు మాట్లాడా, నాకు చాలా క్లోజ్: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణ రావును కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణ రావును కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
దాసరి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తనకు ఆయనతో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని, తన కుటుంబ సభ్యుడి మాదిరిగా తనతో ఉండేవారని చెప్పారు. దాసరి త్వరగా కోలుకుంటున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు.

దాసరి తనను కూడా ఆప్యాయంగా పలకరించారని చెప్పారు. శ్వాస తీసుకోవడంలో కొంత సమస్య ఉందని, రెండు రోజుల్లో మామూలు స్థితికి వస్తారని చెప్పారు.

ఆయన తనతో మాట్లాడారని, పాత విషయాలను కూడా చెప్పారని అన్నారు. రెండు రోజుల్లో దాసరి పూర్తిగా కోలుకుంటారని చెప్పారు. ఆయన వెంటిలెటర్ పైన ఉన్నారన్నది వట్టి పుకారేనని చెప్పారు. చంద్రబాబు అంతకుముందు నందమూరి రామకృష్ణ ఇంట్లో జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొన్నారు.
-
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు












Click it and Unblock the Notifications