చంద్రయాన్-3 నాలుగో కక్ష్య పెంపు విజయవంతం: చంద్రుడికి మరో అడుగు దూరంలో!
న్యూఢిల్లీ: చంద్రయాన్-3 ప్రయోగం విజయం వైపు మరో అడుగు వేసింది. చంద్రుడిపై పరిశోధనలకు గానూ ప్రయోగించిన చంద్రయాన్-3 వ్యోమనౌక చంద్రుడికి సమీపించే దిశలో సాగుతోంది. ఇప్పటి వరకు మూడో కక్ష్యలో భూమి చుట్టూ చక్కర్లు కొట్టిన ఈ వ్యోమనౌకకు సంబంధించిన నాలుగో కక్ష్య పెంపును అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) గురువారం విజయవంతంగా పూర్తి చేసింది.
బెంగళూరులోని ఇస్ట్రాక్ కేంద్రం నుంచి ఈ విన్యాసాన్ని చేపట్టింది. చంద్రయాన్-3కి సంబంధించిన ఐదో, చివరి కక్ష్యను పెంచేందుకు జులై 25న మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య చేపడతామని వెల్లడించింది. చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత అందుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పకటిప్పుడు వెల్లడిస్తోంది.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) July 20, 2023
🇮🇳 India celebrates #InternationalMoonDay 2023 by propelling Chandrayaan-3 🛰️ a step closer to the Moon 🌖
The fourth orbit-raising maneuver (Earth-bound perigee firing) is performed successfully from ISTRAC/ISRO, Bengaluru.
The next firing is planned for… pic.twitter.com/XeuD5c06v1

నేడు అంతర్జాతీయ చంద్ర దినోత్సవం. ఈ సందర్బంగా చంద్రయాన్-3ని చంద్రుడికి మరింత చేరువ చేస్తూ... భారత్ ఈ వేడుక చేసుకుంటోంది అని ట్విట్టర్ వేదికగా ఇస్రో పేర్కొంది. కాగా, జులై 14న ఈ వ్యోమనౌకను ఎల్వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
ఆ తర్వాతి రోజు తొలిసారిగా దీని కక్ష్యను పెంచారు. ఇప్పటి వరకు దశలవారీగా నాలుగుసార్లు పెంచి.. చంద్రయాన్-3ని చంద్రుడికి చేరువచేస్తున్నారు. ఐదో కక్ష్య పూర్తయిన అనంతరం ఈ వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి వెళ్తుంది. అంతా అనుకున్నట్లు సాగితే ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెడుతుంది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయితే ఈ ప్రయోగం దాదాపు విజయవంతమైనట్లే. చంద్రయాన్-2 సాఫ్ట్ ల్యాండ్ కాకపోవడం వల్లనే విఫలమైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications