సంక్రాంతికి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్

Posted By:
Subscribe to Oneindia Telugu

సంక్రాంతి పండుగకు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు మంత్రి చందులాల్ చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెలలో ఆగాఖాన్ ఫౌండేషన్ సహకారంతో పతంగుల ఉత్సవం చేపడుతున్నామన్నారు. కైట్ ఫెస్టివల్ ద్వారా వచ్చే నిధులను బాలికల విద్యను ప్రోత్సహించేందుకు వినియోగిస్తామని తెలిపారు.దేశ, విదేశీ కంపెనీలు ఈ పండుగలో పాల్గొంటాయన్నారు. జనవరి 13, 14, 15 తేదీల్లో ఆగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగను నిర్వహిస్తామని , పతంగుల పండుగకు 16 దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana minister Chandulal said that international kite fesival will be held during sankranthi festival.
Please Wait while comments are loading...