Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-రూట్ మార్పు..!

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి తమిళనాడులోని తాంబరం మధ్య రాకపోకలు సాగించే చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఇవాళ ఓ అలర్ట్ జారీ చేసింది. చార్మినార్ ఎక్స్ ప్రెస్ (Charminar express) రూట్ లో స్వల్ప మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో కూడా వెల్లడించింది. ఈ మేరకు చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం చెన్నై ఎగ్మోర్ స్టేషన్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వీటి కారణంగా పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో హైదరాబాద్ నుంచి తాంబరానికి వెళ్లే చార్మినార్ ఎక్స్ ప్రెస్ (రైలు నంబర్ 12760)ను ఇకపై చెన్నై బీచ్ స్టేషన్ కే పరిమితం చేశారు. ఈ మార్పు ఈ నెల 5వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. అలాగే తాంబరం నుంచి హైదరాబాద్ కు వెళ్లాల్సిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 12759ని సైతం తాంబరానికి బదులుగా చెన్నై బీచ్ స్టేషన్ నుంచే నడుపుతారు. ఈ మార్పు ఈ నెల 6వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

Charminar Express Rerouted Hyderabad Train Now Stops Starts at Chennai Beach Skipping Tambaram

తాజా మార్పుల ప్రకారం చెన్నై బీచ్ స్టేషన్ నుంచి చార్మినార్ ఎక్స్ ప్రెస్ సాయంత్రం 6.20కు హైదరాబాద్ కు బయలుదేరనుంది. అలాగే హైదరాబాద్ నుంచి బయలుదేరే చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు చెన్నై బీచ్ స్టేషన్ కు ఉదయం 7 గంటలకు చేరుకోనుంది. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ లో అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకూ ఈ మార్పు అమల్లో ఉండబోతోంది. పనులు పూర్తయ్యాక తిరిగి చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైళ్లను తాంబరం స్టేషన్ వరకూ నడపనున్నారు. ఆలోపు ప్రయాణికులు ఈ మార్పు గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+