చచ్చినట్లు సర్టిఫికెట్ ఇచ్చి, బతికొచ్చాడు

 Chartered Accountant arrested for faking his death
హైదరాబాద్: ఆర్థిక నేరాలకు సంబంధించి విజయవాడకు చెందిన ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ప్రత్యేక కోర్టును కూడా మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తాను మరణించినట్లు కోర్టుకు ధ్రువీకరణ పత్రం సమర్పించి, మోసం చేసినట్లు చెబుతున్నారు. అయితే అతను బతికే ఉన్నట్లు తెలిసింది.

నాదెళ్ల శ్రీనివాస రావు అనే ఆ సిఎ అరెస్టుకు కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. అతనికి ప్రొఫెసర్లు, వైద్యులు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తల వంటి క్లయింట్లు ఉన్నారు. ఆదాయం పన్ను శాఖలో డిపాజిట్ చేయడానికి బదులు క్లయింట్ల డబ్బులను వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

రిటర్న్స్ దాఖలు చేయకపోవడంపై ప్రశ్నించడానికి ఐటి అధికారులు క్లయింట్ల వద్ద వెళ్లినప్పుడు విషయం బయట పడింది. ఫిర్యాదుతో కోర్టు సిఎకు సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత అతను కోర్టుకు హాజరయ్యాడు. ఆ తర్వాత అతను మరణించాడని ధ్రువీకరణ పత్రం సమర్పిస్తూ కేసును మూసేయాలని ఓ పిటిషన్ దాఖలైంది.

ఆ కేసు 2011లో అర్థిక నేరాల కోర్టు ముందుకు వచ్చింది. సిఎ నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సంపాదించి, తన తరఫు న్యాయవాది దాన్ని కోర్టుకు సమర్పించేలా చూశాడు. ఆదాయం పన్ను శాఖ విచారణలో అతను బతికే ఉన్నట్లు బయటపడింది. దాంతో కోర్టు అతనికి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+