మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కంపెనీ మధుకాన్‌పై చీటింగ్ కేసు

హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ కంపెనీపై చీటింగ్ కేసు నమోదైంది. ఉద్యోగుల నుంచి సేకరించిన ప్రావిడంట్ ఫండ్‌ డబ్బును ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అకౌంట్‌లో జమ చేయకపోవడం వల్లనే జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఈపీఎఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ జీవీఎస్ఎస్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం జూబ్లిహిల్స్ పోలీసులు మధుకాన్ కంపెనీ యాజమాన్యంపై చీటింగ్ కేసు నమోదు చేశారు. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్. 36లో ఉన్న మధుకాన్ కంపెనీ టీడీపీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావుకు చెందింది.

Cheating case against Madhucon company owned by EX MP Nama nageswara rao

2009 నుంచి ఉద్యోగుల నుంచి సేకరించిన ప్రావిడెంట్ ఫండ్ డబ్బును మధుకాన్ ప్రాజెక్ట్స్ ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేయడం లేదని ఈపీఎఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు రూ. 8.5 లక్షల వరకు అవకవతకలు జరిగాయనే ఉద్దేశంతో చీటింగ్ కేసు నమోదు చేసినట్లు జూబ్లిహిల్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్ వెంకట రెడ్డి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+