ఆ ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్: ప్రజలను అలర్ట్ చేసిన పోలీసులు.. (వీడియో)

Subscribe to Oneindia Telugu
  Cheddi Gang/Robbery Gangs Hulchal In Hyderabad City : Video

  హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లి, మియాపూర్‌ ప్రాంతాల్లో మహారాష్ట్రకు చెందిన చెడ్డీ గ్యాంగ్‌ చోరీలకు పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో పోలీసులు తక్షణం అప్రత్తమయ్యారు.

  ఈ నెల 4న ఓ చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్న సందర్భంగా చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులు మారణాయుధాలతో సంచరిస్తున్నట్లు కూకట్‌పల్లి పోలీసులు గుర్తించారు. దీంతో కూకట్ పల్లి, మియాపూర్ పరిసర ప్రాంతాల ప్రజలను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు.

  cheddi gang hulchul in hyderabad

  స్థానికులతో పాటు అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్లకు వారి దృశ్యాలు చూపించి అవగాహన కల్పిస్తున్నారు. చెడ్డీ గ్యాంగ్ ఆచూకీ తెలిసిన వారు వెంటనే తమకు సమాచారమివ్వాలని చెబుతున్నారు. అంతేకాదు, ఆచూకీ చెబితే రివార్డు కూడా ఇస్తామంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Kukatpally police found that Cheddi Gang doing hulchul in Hyderabad, They announced a reward on them.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి