వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చికాగోలో కవిత: విద్యార్థులతో భేటీ(ఫొటోలు)

|
Google Oneindia TeluguNews

చికాగో: తెలంగాణలో పరిశ్రమలు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉందని, ఈ మేరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఎన్నారైలు, విదేశీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిందిగా నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చికాగోలోని భారత్ కాన్సులేట్ జనరల్ డాక్టర్ సయీద్‌ను కోరారు. ఏప్రిల్ 21, 22 తేదీల్లో రెండ్రోజులపాటు చికాగోలో పర్యటించిన ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

 Chicago, Telangana Universities Sign MoU

పర్యటనలో భాగంగా కాన్సులేట్ జనరల్ ఇచ్చిన విందులో పాల్గొన్నారు. చికాగో నగర మాజీ మేయర్ రమిరో, మొదటి ద్వంద్వ పౌరసత్వం కలిగిన భారతీయ అమెరికన్ ఇఫ్తెకార్ షరీఫ్ ఈ విందుకు హాజరయ్యారు. తెలంగాణ జాగృతి, అమెరికా శాఖ ఆధ్వర్యంలో ప్రవాస తెలంగాణవాసులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో తెలంగాణ జాగృతి మొబైల్ ఆప్‌ను ఆవిష్కరించారు.

కవిత పర్యటనలో భాగంగా చికాగో స్టేట్ యూనివర్సిటీ-తెలంగాణ యూనివర్సిటీల మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. గతంలోనే చికాగో స్టేట్ యూనివర్సిటీ అధికారులతో సంప్రదింపులు జరిపిన ఎంపీ కవిత తెలంగాణ యూనివర్సిటీ తరపున సంతకం చేశారు. ఈ ఒప్పందం ద్వారా రెండు యూనివర్సిటీల మధ్య మేధోవనరులు, విద్యార్థుల్ని మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది.

ప్రధానంగా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు, మూల్యాంకనం, ప్రొఫెసర్లు, బోధనా పద్దతులు, పరిశోధక విద్యార్థుల్ని రెండు యూనివర్సిటీలు మార్చుకోవచ్చు. దీని వల్ల రెండు యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు ఎక్కడైనా విద్యాబోధన కొనసాగించవచ్చు.

ఇది తెలంగాణ విద్యా ప్రమాణాల పెంపునకు మైలురాయిగా నిలుస్తుందని ఎంపి కవిత చికాగో యూనివర్సిటీ విద్యార్థులతో అన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యక్షుడు డాక్టర్ వాట్సన్, యూనివర్సిటీ ప్రోవోస్ట్ అంజెలినా అండర్సన్, యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ దేవ్ కలిఫ్, తదితరులు పాల్గొన్నారు.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, నూతన వ్యాపార ఆలోచనలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఎంపీ కవిత సందర్శించారు. ఇలాంటి కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిందిగా ఇంక్యుబేషన్ సెంటర్ సీఈవో హోవార్డ్ తుల్‌మాన్, కో ఆర్డినేటర్ లక్ష్మీసింగ్‌ను కోరారు. అనంతరం సంప్రదాయ, సంప్రదాయేతర ఇంధన సంరక్షణకు, నిల్వ చేసేందుకు ఏర్పాటు చేసిన సీ స్మార్ట్ ఎనర్జీ గ్రిడ్‌ను, హాలీవుడ్ నటుడు రాబర్డ్ డివిరో ఏర్పాటు చేసిన ట్రెబెకా ఫ్లాష్ పాయింట్‌ను ఎంపీ కవిత సందర్శించారు.

English summary
In a move that would have a telling effect on the education standards of students of the State, Nizamabad MP K Kavitha, on behalf of the Telangana University, Nizamabad, signed a Memorandum of Understanding (MoU) with the Chicago State University for student exchange programmes between the two universities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X