చంద్రబాబుకు డాక్టరేట్: చికాగో-టీ వర్సిటీల ఎంవోయూ వైఫల్యం?

హైదరాబాద్: గతేడాది అమెరికాలోని చికాగో స్టేట్ వర్సిటీతో నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుని ఒక చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఒప్పందం దిశగా ముందుకు అడుగులు పడకపోవడంతో దీనిని వైఫల్యంగా భావిస్తున్నారు.

రెండు వర్సిటీల మధ్య ఈ చారిత్రక ఒప్పందం కుదర్చడానికి నిజమాబాద్ ఎంపీ కవిత చికాగో వర్సిటీని సైతం సందర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో క్యాంపు కార్యాలయంలో తెలంగాణ వర్సిటీ, అమెరికాలోని చికాగో వర్సిటీల మధ్య ఎంవోయూ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ వర్సిటీలోని రెండు కోర్సులకు చికాగో వర్సిటీలో చదివే అవకాశం లభించింది. కంప్యూటర్ సైన్స్, ఎమ్మెస్సీ అప్లయిడ్ స్టాటిస్టిక్స్ విభాగాలకు ఈ అరుదైన అవకాశం లభించింది. ఈ రెండు వర్సిటీల్లోని విద్యార్థులను, బోధనా సిబ్బందిని, సిలబస్‌ను ఇచ్చిపుచ్చుకునే అవకాశం ఏర్పడింది.

వాస్తవానికి విదేశాల్లో విద్యను అభ్యసించాలంటే అక్కడి వీసాతో పాటు గ్రాడ్యుయేట్ రివిజనింగ్ ఎల్జిబిలిటీ టెస్ట్(జీఆర్‌ఈ, టోఫెల్)పరీక్షని పాస్ కావాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం ద్వారా ఇవేమి లేకుండా అమెరికాలాంటి దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభించింది.

Chicago varsity troubles hit Telangana University deal

తెలంగాణ, చికాగో వర్సిటీలో ఎంవోయూతో నేరుగా చికాగో వర్సిటీలో ఇక్కడి విద్యార్థులు చదువుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ఈ ఒప్పందం వల్ల విద్యార్ధులకు ఎటువంటి ప్రయోజనం లేదని, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, ఎమ్మెస్సీ అప్లయిడ్ స్టాటిస్టిక్స్ విభాగాల సబ్జెక్టు సిలబస్‌లో తేడా ఉన్నట్లు గుర్తించారు.

అంతేకాదు గతేడాది ఫిబ్రవరి నుంచి చికాగో వర్సిటీ ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ వర్సిటీపై అమెరికా మీడియా సైతం పలు కథనాలను ప్రచురించింది. ఇల్లినాయిస్ రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీకి అందించే ఫండ్స్‌ని సైతం తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు ఈ కథనాల్లో పేర్కొన్నాయి.

ఈ ఒప్పందం వల్ల విద్యార్ధులకు ఎలాంటి ప్రయోజనం లేదని తెలంగాణ వర్సిటీ అధికారులు తేల్చేశారు. తెలంగాణ వర్సిటీలో చదువుకుంటోన్న విద్యార్ధుల్లో ఎక్కువ మంది వెనుకబడిన తరగతులకు చెందిన వారు కావడం ఒకటి కాగా, రెండోది చికాగో వర్సిటీలో చదవాలంటే ఏడాదికి రూ. 20 లక్షలు (ట్యూషన్ ఫీజులు, పాకెట్ మనీ) ఖర్చులు అవుతాయని అంచనా.

అయితే కంప్యూటర్ సైన్స్ విభాగానికి సంబంధించి సబ్జెక్టు సిలబస్‌లో ఎటువంటి ఇబ్బంది లేదని, అయితే కేవలం ఒకరిద్దరు మాత్రమే ఆసక్తిని చూపినట్లు వారు తెలిపారు. ఇదిలా ఉంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి డాక్టరేట్ ప్రకటించిన యూనివర్సిటీ కూడా ఇదే కావడం విశేషం.

విదేశాల్లోని వర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకునే దానిపై శ్రద్ధ కనబర్చడం కంటే వర్సిటీల్లో ఉన్న వైస్ ఛాన్సలర్ ఖాళీలను నిమిమిస్తే బాగుంటుందని తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్ అసోసియేషన్ పేర్కొంది. వాస్తవానికి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో తెలంగాణ, చికాగో వర్సిటీల ఎంవోయూ కుదుర్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+