వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘జోస్యం’తో సంబంధం లేదు: ముందస్తు ఎన్నికలపై స్పష్టతనిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు నిర్ణయంపై కేంద్రం ఎన్నికల సంఘం కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసీఆర్ నిర్ణయం అస్వాభావికంగా ఉందని పేర్కొంది.

డిసెంబర్‌లో లోకసభ ఎన్నికల్లేవు, అదే ప్రధాన సమస్య: కేంద్ర ఎన్నికల సంఘండిసెంబర్‌లో లోకసభ ఎన్నికల్లేవు, అదే ప్రధాన సమస్య: కేంద్ర ఎన్నికల సంఘం

చర్చించిన తర్వాతే..

చర్చించిన తర్వాతే..

అయితే, నాలుగు రాష్ట్రాలతోపాటు తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలో, లేదో అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓపీ రావతి తెలిపారు. దీనిపై సాధ్యాసాధ్యాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

 నాలుగు రాష్ట్రాలతోపాటు నిర్వహించాలంటే..

నాలుగు రాష్ట్రాలతోపాటు నిర్వహించాలంటే..

జమిలి ఎన్నికలైతే పార్లమెంటుతోపాటే తెలంగాణ అసెంబ్లీకి జరిగేవని, ఏప్రిల్ 2019లో అవి జరగాల్సి ఉందన్నారు. కానీ, ఇప్పుడు ఆ వాదనకు అవకాశం లేదని తెలిపారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికలతోపాటు తెలంగాణలో కూడా ఎన్నికలు నిర్వహించాలంటే అందుకు తగిన ఏర్పాట్లను సమీక్షించాల్సి ఉంటుందన్నారు.

ముందస్తుపై ఈసీ స్పష్టత

ముందస్తుపై ఈసీ స్పష్టత

చట్టంఈ విషయంపై ప్రత్యేకంగా ఎలాంటి నిబంధనా లేదని, దీనిపై 2002లో రాష్ట్రపతి సుప్రీంకోర్టుకోర్టు అభిప్రాయం కోరగా.. అసెంబ్లీ రద్దయినప్పుడు ఎన్నికలు త్వరగా జరపాలని అత్యున్నత న్యాయస్థానం సూచించిందని తెలిపారు. ఎందుకంటే.. అబద్ధర్మ ప్రభుత్వానికి ఆయాచిత ప్రయోజనం పొందేలా ఆరు నెలలపాటు అధికారంలో ఉండకూడదని సూచించిందని వివరించారు.

జోస్యంతో సంబంధం లేదు..

ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని ఓపీ రావతి తెలిపారు. నాలుగు రాష్ట్రాలతోపాటు తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగుతాయని ఎవరో జోస్యం చెబితే ఎన్నికల సంఘానికి సంబంధం లేదని ఓపీ రావత్ అన్నారు.

English summary
The Election Commission has expressed displeasure over Telangana Chief Minister K Chandrasekhar Rao's party raising the decibel on pushing for early assembly elections in the southern state. Ahead of the full meeting of the Election Commission, Chief Election Commissioner OP Rawat on Friday appeared to hint at the possibility of holding Assembly elections in Telangana along with the polls due in four other states in December this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X