CM Revanth Reddy: గీత కార్మికులకు సేఫ్టీ మోకులు పంపిణీ చేసిన సీఎం రేవంత్..
తెలంగాణ జనాభాలో గౌడ సామాజిక వర్గ జనాభా అధికంగానే ఉంది. ఇందులో అధికంగా కుల వృత్తిని నమ్ముకుని బతుకుతున్నవారు ఉన్నారు. అయితే తాటి చెట్టు నుంచి కింద పడి చనిపోయేవారు పెరిగిపోతున్నారు. ప్రతి సంవత్సరం సగటున 500 మంది గీత కార్మికులు తాటి చెట్ల పైనుంచి కింద పడిపోతున్నారు. సంవత్సరానికి సగటున 200 మంది తాటి చెట్ల పై నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోతున్నారు. మిగతా 300 మంది తీవ్ర గాయాలతో మంచానికి పరిమితమవుతున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గీత కార్మికుల కోసం సేఫ్టీ మోకును అందించాలని నిర్ణయించింది. గౌడ్స్ కుల దైవం కాటమయ్య రక్షణ కవచం పేరతో ఈ మోకులను అందజేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లష్కర్ గూడలో కాటమయ్య రక్షణ కవచంను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గీత కార్మికులకు సేఫ్టీ మోకులను అందజేశారు. సేఫ్టీ మోకులను గౌడన్నలతో కలిసి చెక్ చేయించారు. వాటి పనితీరు ఎలా ఉందని గౌడన్నలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

వన మహోత్సవరంలో భాగంగా తాటి,ఈత మొక్కలను పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి గీత కార్మికులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఇతర మంత్రులు హాజరయ్యారు. గీత కార్మికుల పరిస్థితి చూసి చలించిపోయిన మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్, టాడీ కార్పొరేషన్ కమిషనర్ బుర్రా వెంకటేశం సేఫ్టి మోకులు తయారు చేయించాలని చూశారు.
వారి సూచనల మేరకు పలు ఏజెన్సీలు సేఫ్టీ మోకులను తయారు చేశాయి. హైదరాబాద్ ఐఐటీతో కలిసి ఓ ప్రైవేటు సంస్థ తయారు చేసిన సేఫ్టీ మోకు ప్రాక్టికల్ గా చెక్ చేశారు. బాగా పని చేస్తుండడంతో దాన్ని ఫైనల్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికులకు సేఫ్టీ మోకులను అందజేయనున్నారు. సేఫ్టీ మోకు కిట్ లో తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్ , స్లింగ్ బ్యాగ్,లెగ్ లూప్ ఉంటాయని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications