Second Phase Runa Mafi: రైతులకు శుభవార్త.. రుణ మాఫీ నిధుల విడుదల.. !
తెలంగాణ ప్రభుత్వం రెండో విడత రుణ మాఫీ నిధులను విడుదల చేసింది. అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో దశ రుణ మాఫీ నిధులను విడుదల చేశారు. రెండో దఫాలో రూ.6,190 కోట్లను 6.4 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో కలిపి రుణ మాఫీ కోసం అన్నదాతల ఖాతాల్లో రూ.12,289 కోట్లను జమ చేశారు. జులైప 18న తొలి విడతలో 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,035 కోట్లను జమ చేశారు.
ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లించే వారు, గవర్నమెంట్ ఎంప్లాయిస్, పింఛన్ దారులను ప్రభుత్వం అర్హుల జాబితా నుంచి తెలిగించిన సంగతి తెలిసిందే.
రైతు రుణ మాఫీ చేయడానికి తగినంత సొమ్ము ప్రభుత్వం వద్ద లేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ.3 వేల కోట్లు అప్పు తీసుకొచ్చి అన్నదాతల రుణ మాఫీ కోసం వెచ్చించింది. ప్రభుత్వ వివరాల ప్రకారం లక్ష, లక్షన్నర మధ్య అప్పున్న రైతులు సంఖ్య దాదాపు 7 లక్షల మంది ఉన్నారు.

వారికి రూ.6,500 కోట్లు సరిపోతాయని అంచనా వేసి మంగళవారం అన్నదాతల ఖాతాల్లో రూ.6,190 కోట్లను జమ చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో కొంత మంది రైతులకు సీఎం రేవంత్ రెడ్డి చెక్కులు అందించారు. ఇక జిల్లాలో కలెక్టర్లు రైతులకు రుణమాఫీ చెక్కులను అందజేశారు. జిల్లాల్లో కాంగ్రెస్ నేతలు రైతులతో కలిసి సంబరాలు చేస్తున్నారు. మూడో విడతలో భాగంగా రూ.2 లక్షల వరకు రైతు రుణ మాఫీ చేయనున్నారు. మూడో విడత రుణ మాఫీ ఎప్పుడు చేస్తారు అనేది క్లారిటీ లేదు.
రెండో దశ రుణ మాఫీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని సమస్యలున్నా రుణ మాఫీ చేస్తున్నామని ప్రకటించారు. తమకు రాజకీయ ప్రజయోజనం ముఖ్యం కాదని రైతు ప్రయోజనమే ముఖ్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఉన్నా రుణ మాఫీ చేయలేదని విమర్శించారు.












Click it and Unblock the Notifications