చిక్కుల్లో ముఖ్యమంత్రులు: కేసీఆర్, బాబుల ఎత్తు, పైఎత్తులు
హైదరాబాద్: కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ రాజకీయాలు వేడెక్కాయి. కేంద్రంలో కూడా లలిత్ మోడీ వ్యవహారంతో రాజకీయాలు ఘాటుగా మారాయి. ఓటుకు నోటు వ్యవహారం ఏపీ సీఎం చంద్రబాబుకు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చిక్కులు తెచ్చేలా కనిపిస్తోంది.
అలాగే, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ అంశం రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేను ఇరకాటంలో పెట్టింది. ఆస్తుల కేసులో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ఇరుక్కున్నారు. మరోవైపు, ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ వరుసగా చిక్కుల్లో పడుతున్నారు.

చంద్రబాబు నాయుడు
ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ సీఎం నారా చంద్రబాబును చిక్కుల్లోకి నెట్టింది. ఆయనకు ఏ సమయంలోనైనా నోటీసులు ఇవ్వవచ్చునని అంటున్నారు.

కేసీఆర్
ఓటుకు నోటుకు కౌంటర్‌గా ఏపీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పైకి తీసుకు వచ్చింది. ఈ విషయమై టెలికాం ప్రొవైడర్లను సిట్ బృందం విచారిస్తోంది. ఇది కేసీఆర్‌ను చిక్కుల్లోకి నెట్టే అంశమే అంటున్నారు.

వసుంధర రాజే
లలిత్ మోడీ వ్యవహారంలో వసుంధర రాజే పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు. ఆమె రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఆమె కుటుంబానికి ఆప్తమిత్రుడు, కేబినెట్ మినిస్టర్ రాజేంద్ర రాథోడ్ గురువారం ఉదయం వసుంధరతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రాజస్థాన్ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

అరవింద్ కేజ్రీవాల్
తన కేబినెట్‌లోని మంత్రులతో ఇటీవలి వరకు అరవింద్ కేజ్రీవాల్ చిక్కులు తెచ్చుకున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. హామీలు నెరవేర్చలేక కేజ్రీవాల్ అలా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

వీరభద్ర సింగ్
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరభద్ర సింగ్ పైన కూడా విమర్శలు వచ్చాయి. ఆస్తుల పైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ జరపనుంది.

జయలలిత
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కూడా అక్రమాస్తుల కేసు చిక్కుల్లో ఉన్నారు. ఆమెను ఇటీవలే కోర్టు నిర్దోషిగా తీర్పు చెప్పింది. దీనిపై కర్నాటక కోర్టు సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
కేబినెట్లోని మంత్రుల వ్యవహారం ఆయనను చిక్కుల్లో పడేసింది. అయితే, లలిత్ మోడీ వ్యవాహం కారణంగా ఆయన భారతీయ జనతా పార్టీ పైన ఎదురు దాడికి దిగుతున్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు నోటీసులు ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ పైన తమ ప్రభుత్వం వద్ద పక్కా ఆధారాలున్నాయని, వాటిని బయటపెడితే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందని ఏపీ నేతలు చెబుతున్నారు. లలిత్ మోడీ కోసం వసుంధర సంతకాలు చేసినట్లు కాంగ్రెస్ బుధవారం ఓ లేఖను విడుదల చేసింది. అయితే, ఆ లేఖ పైన బీజేపీకి అనుమానాలున్నాయి.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications