రెక్కీ జరిగింది- రక్షణ కల్పించాలి : చికోటి ప్రవీణ్‌ సంచలనం...!!

చికోటి ప్రవీణ్‌ సంచలన ఆరోపణలు చేశారు. తన పై రెక్కీ జరిగిందనే అనుమానం వ్యక్తం చేసారు.

చికోటి ప్రవీణ్‌ సంచలన ఆరోపణలు చేశారు. తన కారు చోరీ సాధారణ దొంగతనం కాదన్నారు, ఎవరో కావాలనే రెక్కీ నిర్వహించి ఉంటారని అనుమానం వ్యక్తం చేసారు. గోవా క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారణను ఎదుర్కొన్న చికోటి ప్రవీణ్‌ తన కారు దొంగతనం కుట్రలో భాగమేననని అన్నారు. తనకు ప్రత్యర్థుల నుండి ప్రాణహాని ఉందన్నారు. తన ఇంటి వద్ద గత కొంతకాలంగా దుండగులు రెక్కి నిర్వహిస్తున్నారని సంచలన ఆరోపణలు చేసారు. గతంలో తనపై నమోదైన కేసు ప్రస్తుతం ఈడీ దర్యాప్తులో ఉందన్నారు. రెక్కీ వ్యవహారం పైన పోలీసులు విచారణ జరపాలన్నారు. తనకు భద్రత పెంచాలని ప్రవీణ్ కోరారు.

క్యాసినో వ్యవహారంలో వెలుగులోకి వచ్చిన చీకోటి ప్రవీణ్ తన పైన రెక్కీ జరిగిదంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం కూడా క్యాసినో నిర్వహిస్తునే ఉన్నానని, అది తన వృత్తి అని చెప్పారు. ప్రభుత్వానికి ట్యాక్సులు చెల్లించి లీగల్ ఉన్న చోటే క్యాసినో నిర్వహిస్తున్నానని స్పష్టం చేశారు. అవకాశం ఉంటే రాజకీయాల్లోకి రావడానికి రెడీగా ఉన్నానని తన మనసులో మాట చెప్పారు. తాను పాలిటిక్స్ లోకి రావడం కొంతమందికి ఇష్టం లేదన్నారు. తాను భవిష్యత్తులో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది ఇంకా క్లారిటీ లేదన్నారు. గతంలోనూ తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయన్నారు. తాను మాట్లాడే మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చని చెప్పారు. తన కారు చోరీ చేసింది దొంగలా లేక ఎవరనేది తనకు స్పష్టత లేదని పేర్కొన్నారు.

Chikoti Praveen alleged some people targets him, suspeced that there is a conspiracy

ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చిన ఆగంతకుల దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయని చెప్పారు. క్యాసినో వ్యవహారంలో కొందరు రాజకీయ నేతల పేర్లు చెప్పాలని బెదిరింపులు వచ్చాయని వెల్లడించారు. తాను అందుకు అంగీకరించకపోవటంతో టార్గెట్ చేసారని ఆరోపించారు.తాను రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెలుసుకొని కొంతమంది టార్గెట్‌ చేశారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు చీకోటి ప్రవీణ్ చేసిన ఈ వ్యాఖ్యల సంచలనంగా మారాయి. అయితే, చోకోటి ప్రవీణ్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసారనేది స్పష్టత రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+