గుప్తనిధులు: తల్లికి మత్తుమందిచ్చి.. చిన్నారి బలి
రంగారెడ్డి: జిల్లాలోని యలాలలో దారుణం చోటు చేసుకుంది. తల్లికి మత్తుమందు ఇచ్చిన దుండగులు 7 నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి గుప్త నిధుల కోసం బలిచ్చారు. వివరాల్లోకి వెళితే..యలాల మండలంలోని అక్కపల్లి గ్రామంలో తుప్పల లక్ష్మమ్మ అనే మహిళ తన ఏడు నెలల కుమార్తెతో తన అక్క ఇంట్లో నివాసం ఉంటుంది.
బుధవారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు లక్ష్మమ్మకు మత్తుమందు ఇచ్చి ఆమె కూతురు పూజను ఎత్తుకెళ్లి హత్య చేశారు. ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో అర్థరాత్రి ఓ గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో వాహనదారుడు సంఘటనాస్థలంలోనే మృతిచెందాడు. సమాచారం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీమార్చురీకి తరలించారు.
సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. మృతుడు ఏపీలోని విశాఖపట్నానికి చెందిన వర్రె నటరాజుగా గుర్తింపు.












Click it and Unblock the Notifications