దేశంలోనే అతిపెద్ద టవర్‌కు చైనా సహకారం, నెదర్లాండ్ ఆసక్తి: కెసిఆర్‌తో భేటీ(పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టే వంతెనలు, టన్నెళ్లు, బహుళ అంతస్తుల నిర్మాణాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చైనాకు చెందిన పలు కంపెనీలు, బ్యాంకులు ముందుకు వచ్చాయి. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చైనా పర్యటనకు వెళ్లినప్పుడు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేసిన కంపెనీల ప్రతినిధుల బృందం శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చింది.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన ఈ బృందం ప్రతినిధులు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నీటిపారుదలశాఖ చేపట్టబోయే ప్రాజెక్టులతో పాటు హుస్సేన్‌సాగర్ ఒడ్డున నిర్మించనున్న దేశంలోనే అతి పెద్ద టవర్ నమూనా, ప్రతిపాదనపై వారు ముఖ్యమంత్రితో చర్చించారు.
దేశంలోనే అతి పెద్ద టవర్ నిర్మాణానికయ్యే వ్యయంలో 85 శాతం భరించడానికి బ్యాంక్ ఆఫ్ చైనా సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించనున్న టన్నెళ్లను తక్కువ సమయంలో, అత్యంత నాణ్యతతో పూర్తి చేయనున్నట్టు వారు ముఖ్యమంత్రికి వివరించారు. మూసీనదిపై నిర్మించబోయే బ్రిడ్జి నిర్మాణంపై కూడా వారు ఈ సందర్భంగా చర్చించారు.
అలాగే దుర్గం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మించడానికి సిసిసిసి హైవే కన్సల్టెన్సీ అంపెనీ సుముఖత వ్యక్తం చేసింది. చైనాకు చెందిన కంపెనీల బృందం చేసిన ప్రతిపాదనలపై త్వరలో మరోసారి అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రిని కలిసిన చైనా బృందంలో బ్యాంక్ ఆఫ్ చైనా ఇండియా హెడ్ చిప్ హెంగ్ చాంగ్, అంజు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ యొగేశ్ వా, ఇండియా హెడ్ మనోజ్ గాంధీ, సిసిసిసి మేనేజర్ పెంగ్ యన్‌గాంగ్, బిజినెస్ మేనేజర్ చాంగ్ చున్ యుమాన్, బీజింగ్ జెడ్‌వైటెక్స్ బిజినెస్ మేనేజర్ వుహాన్, రాడిక్ కన్సల్టెన్సీకి చెందిన ప్రతినిధులు జహీర్ అహ్మద్, రాజ్‌కుమార్ ఉన్నారు.
నెదర్లాండ్ ప్రతినిధుల భేటీ

కెసిఆర్‌తో ప్రతినిధులు
రాష్ట్రంలో వ్యవసాయం, ఆరోగ్యపరిరక్షణ, పర్యాటకరంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశానికి చెందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని నెదర్లాండ్స్ రాయబారి అల్ఫోన్సస్ స్టొలింగా పేర్కొన్నారు.

కెసిఆర్‌తో ప్రతినిధులు
శుక్రవారం సాయంత్రం అల్ఫోన్సస్ నేతృత్వంలో నెదర్లాండ్స్‌కు చెందిన సుమారు 15 కంపెనీల ప్రతినిధుల బృందం సీఎంను క్యాంపు కార్యాలయంలో కలిసింది.

కెసిఆర్‌తో ప్రతినిధులు
ఈ సందర్భంగా ఇరువురికి లాభదాయకంగా ఉండే వ్యాపార అవకాశాలపై చర్చించారు. అగ్రికల్చర్, గ్రీన్‌హౌస్ కల్టివేషన్, అగ్రికల్చర్ వర్సిటీ, హార్టికల్చర్ వర్సిటీ తదితర అంశాలు ప్రధానంగా చర్చకువచ్చాయి.

కెసిఆర్‌తో ప్రతినిధులు
ప్రతినిధి బృందంతో సమావేశం సందర్భంగా ఎకనామిక్స్, అగ్రికల్చర్, రీసెర్చ్ తదితర ప్రత్యేక అంశాలపై చర్చించారు.

కెసిఆర్‌తో ప్రతినిధులు
రాష్ట్రంలో చేపట్టే వంతెనలు, టన్నెళ్లు, బహుళ అంతస్తుల నిర్మాణాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చైనాకు చెందిన పలు కంపెనీలు, బ్యాంకులు ముందుకు వచ్చాయి.

కెసిఆర్‌తో ప్రతినిధులు
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చైనా పర్యటనకు వెళ్లినప్పుడు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేసిన కంపెనీల ప్రతినిధుల బృందం శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చింది.
రాష్ట్రంలో వ్యవసాయం, ఆరోగ్యపరిరక్షణ, పర్యాటకరంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశానికి చెందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని నెదర్లాండ్స్ రాయబారి అల్ఫోన్సస్ స్టొలింగా పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం అల్ఫోన్సస్ నేతృత్వంలో నెదర్లాండ్స్‌కు చెందిన సుమారు 15 కంపెనీల ప్రతినిధుల బృందం సీఎంను క్యాంపు కార్యాలయంలో కలిసింది.
ఈ సందర్భంగా ఇరువురికి లాభదాయకంగా ఉండే వ్యాపార అవకాశాలపై చర్చించారు. అగ్రికల్చర్, గ్రీన్‌హౌస్ కల్టివేషన్, అగ్రికల్చర్ వర్సిటీ, హార్టికల్చర్ వర్సిటీ తదితర అంశాలు ప్రధానంగా చర్చకువచ్చాయి.
ప్రతినిధి బృందంతో సమావేశం సందర్భంగా ఎకనామిక్స్, అగ్రికల్చర్, రీసెర్చ్ తదితర ప్రత్యేక అంశాలపై చర్చించారు. ఫిలిప్స్ క్యాపిటల్ సంస్థ ప్రతినిధి సీఎంతో మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు నుంచి వచ్చిన సూచనమేరకు తాము ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్‌కేర్ సేవలకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని చెప్పారు.
ఈ మూడు సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, అదనపు కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications