వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్: చైనాలోను బాబు కోసం బాగా 'వెతికారు', కెసిఆర్ కంటే తక్కువ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారత దేశం వెలుపల అమెరికా వంటి దేశాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుపరిచితులు. అమెరికా వంటి దేశాల్లో తెలుగువారు ఎక్కువగా ఉంటారు. సమైక్య ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఐటీని అభివృద్ధి చేశారు.

తదితర కారణాలతో ఆయన అమెరికా వంటి దేశాల్లో బాగా తెలిసిన వ్యక్తి. అయితే, మరో విషయమేమంటే అమెరికాతో పాటు చైనాలోను చంద్రబాబుకు బాగా ఫాలోయింగ్ ఉందని తాజాగా తేలింది.

నారా చంద్రబాబు నాయుడు గురించి భారత్ తర్వాత ఎక్కువగా వెతికింది చైనా దేశీయులేనట. భారత్, చైనా తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఉంది. ఇందులో చాలా వరకు న్యూజెర్సీ, వర్జీనియా, టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూయార్క్ తదితర నగరాల్లో ఎక్కువ మంది చూశారు.

China Googles Chandrababu Naidu the most

గూగుల్‌ను చైనాలో 2010లో బ్లాక్ చేశారు. ఇటీవలె తిరిగి మళ్లీ కొనసాగుతోంది. బ్లాక్ చేసిన సమయంలోను వర్చువల్ ప్రయివేట్ నెట్ వర్క్ ద్వారా చంద్రబాబు కోసం చాలా మంది సెర్చ్ చేశారు. చంద్రబాబు కోసం వెతికిన చైనా నగరాల్లో హాంగ్ కాంగ్ మొదటి స్థానంలో ఉంది.

మొత్తంగా గూగుల్‌లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంటే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఎక్కువ మంది వెతికారు. చంద్రబాబు ఇటీవల చైనా, జపాన్, సింగపూర్ దేశాలలో పర్యటించారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటించారు. ఈ గూగుల్ డేటా 2004 నుంచి 2015కు సెర్చ్ చేసినవి.

English summary
Outside of India, AP CM Chandrababu Naidu is known to be popular in the United States where a large number of Telugus reside.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X