ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన చింతమడక గ్రామస్తులు: నినాదాలతో హోరెత్తించారు
గజ్వేల్: బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR)ను బుధవారం చింతమడక వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి కలిశారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రం (ఫాంహౌస్)లో కేసీఆర్‌ను కలిసి తమ సంఘీభావం తెలియజేశారు. కేసీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చింతమడక గ్రామస్థులకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ వెంట హరీశ్ రావు, పలువురు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
కాగా, తమ అభిమాన నేత కేసీఆర్‌ను చూసేందుకు గత మూడు రోజులుగా ఎర్రవెల్లి నివాసానికి పార్టీ నేతలు, ప్రజలు, ఇతర ప్రముఖులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. బుధవారం చింతమడక గ్రామం నుంచి వేలాదిగా ప్రజలు తమ సొంత గ్రామ బిడ్డను చూసేందుకు ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నారు.

అధినేత కేసీఆర్‌ను చూడగానే జయ జయ ద్వానాలు చేశారు. వారిలో గూడుకట్టుకున్న అభిమానం ఒక్కసారిగా పెల్లుబికింది. కేసీఆర్‌ను చూసిన వారి అభిమానం కట్టలు తెంచుకుంది. పెద్ద యెత్తున జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకురికారు. వారికి అధినేత కేసీఆర్ అభివాదాలు చేశారు.
కాగా, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. 60కిపైగా స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అధికారిక నివాసం ప్రగతిభవన్‌ను ఖాళీ చేశారు. ఆ తర్వాత నేరుగా ప్రైవేట్ వాహనాల్లో ఎర్రవెల్లి ఫౌంహౌస్ చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు.

సీఎం కేసీఆర్ అంటూ ఫ్యాన్స్ నినాదాలు ..కేసీఆర్ రియాక్షన్ చూడండి..!#KCR #CMKCR #BRSParty #Telangana #Oneindiatelugu pic.twitter.com/76a9luqVPo
— oneindiatelugu (@oneindiatelugu) December 6, 2023
కాగా, బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో వజయం సాధించి ప్రతిపక్ష పాత్రను పోషించనుంది. కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్.. తెలంగాణ అభివృద్ధి కోసం ఆ ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని వెల్లడించారు.
-
సీఎం రేవంత్‌కు దమ్ముంటే - కేటీఆర్ సంచలన డిమాండ్..!! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్












Click it and Unblock the Notifications