అల్లు అర్జున్ కోసం పోలీసు స్టేషన్ కు చిరంజీవి..!!

ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ కోసం మెగాస్టార్ చిరంజీవి పోలీసు స్టేషన్ కు వచ్చారు. పలువురు సినీ ప్రముఖులు స్టేషన్ కు చేరుకున్నారు. ఈ ఉదయం అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు.సంధ్యా థియేటర్ వద్ద పుష్ఫ -2 ప్రీమియర్ షో ప్రదర్శించిన వేళ అల్లు అర్జున్ సినిమా హాల్ వద్దకు ముందస్తు సమాచారం లేకుండా వెళ్లారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఆమె కుమారుడు పరిస్థితి విషమంగా మారింది. దీని పైన పోలీసులు కేసులు నమోదు చేసారు.

ఈ కేసులో ఇప్పటికే సంథ్యా థియేటర్ ఓనర్ ను అరెస్ట్ చేసారు. కాగా, తాజాగా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్ కు తరలించారు. పుష్ఫ -2 ప్రీమియర్ షో ను ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ లో ప్రీమియం షో ప్రదర్శించారు. ఆ సమయంలో అల్లు అర్జున్ అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు సంధ్యా థియేటర్ కు చేరుకున్నారు. దీంతో, పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట లో హైదరాబాద్ నగరానికి చెందిన తొక్కిసలాటలో దిల్‌సుఖ్‌ నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందారు.

Chiranjeevi reaches Police station for Allu Arjun who arrested in stampede case in Hyderabad

ఆ సమయంలోనే ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్‌ పరిస్థితి విషమంగా మారింది. ఆ వెంటనే సీపీఆర్ చేసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రీమియర్‌ షో చూసేందుకు రేవతి, ఆమె భర్త భాస్కర్‌, ఇద్దరు పిల్లలు శ్రీతేజ్‌, సన్వీక (7) దిల్‌సుఖ్‌ నగర్‌ నుంచి సంధ్య థియేటర్‌కు వచ్చారు. అదే సమయంలో.. హీరో అల్లు అర్జున్‌ సంధ్య థియటర్‌ వద్దకువచ్చారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న అభిమానులు ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. ఆ సమయంలో జరిగిన తొక్కిస లాటలో మహిళ మరణించటంతో పోలీసులు కేసు నమోదు చేసారు.

అల్లు అర్జున్ కోసం అల్లు అరవింద్ తో పాటుగా పలువురు సినీ ప్రముఖులు పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న చిరంజీవి తన షూటింగ్ మధ్యలోనే ఆపి పోలీసు స్టేషన్ కు వచ్చారు. అటు అల్లు అర్జున్ తరపు న్యాయ వాదులు కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. అరెస్ట్ నిలుపుదల చేయాలని కోరారు. ఇప్పటికే నగర పోలీసు కమిషనర్ అల్లు అర్జున్ అరెస్ట్ పైన ప్రకటన చేసారు. కాసేపట్లో వైద్య పరీక్షల తరువాత అల్లు అర్జున్ ను కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+