హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాధించింది: హైద్రాబాద్‌పై చిరు, పవన్ కళ్యాణ్ సక్సెస్ కావాలి.. కానీ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయకపోవడం బాధించిందని, విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ బలిచేయబడిందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి చిరంజీవి అన్నారు. పవన్ కళ్యాణ్ విషయమై మాట్లాడుతూ.. ఫ్యామిలీగా వన్, రాజకీయంగా టూ అన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు.

తాను సినిమాలు చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అందుబాటులో ఉంటానని, రాజకీయానికి సమయం కేటాయిస్తానని చెప్పారు. ప్రత్యేక హోదా పైన బిల్లులో పెట్టలేదనే సాకుతో కేంద్రం దానిని పక్కన పెట్టవద్దని అభిప్రాయపడ్డారు. ఒకరు వ్యక్తిగతంగా పోరాడితే హోదా రాదని, అందరు సమష్టిగా పోరాడాలన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఒక్క సీటు రాకపోవడంపై స్పందిస్తూ.. అన్ని పార్టీలు ఒప్పుకున్నాకే కాంగ్రెస్ పార్టీ విభజనపై నిర్ణయం తీసుకుందని, కుటిల రాజకీయాలకు పార్టీ బలైందన్నారు. తెలంగాణ నిర్ణయంలో రాజకీయాలు లేవని, అన్ని పార్టీల తర్వాత ఉక్కిరిబిక్కిరై కాంగ్రెస్ పార్టీ కార్నర్ అయిందన్నారు.

Chiranjeevi responds on Division and Jana Sena

తాము ఆపేందుకు ప్రయత్నించామని, అనివార్యమని తేలాక హైదరాబాద్ విషయమై కొట్లాడామన్నారు. ఈ విషయంలో తాను డిసప్పాయింట్ అయ్యానని చిరంజీవి చెప్పారు. హైదరాబాద్ లేకపోవడం వల్ల ఏపీ బాగా నష్టపోయింది కాబట్టి ప్యాకేజీలు, పలు సంస్థలను కోరామన్నారు.

హైదరాబాదును తాను చెప్పినప్పుడే కేంద్రపాలిత ప్రాంతం చేసి ఉంటే ఓటుకు నోటు సమయంలో సెక్షన్ 8 కోసం డిమాండ్ చేసే పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. పూర్తి కాలం యూటీ కాకపోయినా.. పదేళ్ల కాలం అడిగామన్నారు. ఏం ఇబ్బందులో కానీ అది జరగలేదన్నారు.

ఓటుకు నోటు కేసులో తమకు సంబంధం లేదని చెప్పలేకపోతున్నారని పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. దానికి ప్రతిగా ఫోన్ ట్యాపింగ్ తెరపైకి తెచ్చారన్నారు. తప్పు జరిగిందని, ఇరుక్కున్నవాళ్లు ఉన్నారని, పరోక్షంగా ఉన్నవారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

బిజెపి, ప్రధాని నరేంద్ర మోడీ వాగ్ధానాలు మాటల్లో తప్ప చేతల్లో లేవన్నారు. ప్రదాని మోడీ మాటకారి అని, అందుకే విదేశాల్లోను ప్రశంసలు పొందుతున్నారని, అభివృద్ధి విషయంలో మాత్రం ప్రచారమేనని చెప్పారు. నల్లధనం గురించి చెబితే తాను కూడా తెస్తాడేమో అనుకున్నానని, కానీ అది జరగడం లేదన్నారు.

పవన్ కళ్యాణ్ విషయమై మాట్లాడుతూ.. తనకు పవన్, రామ్ చరణ్ తేజ రెండు కళ్లలాంటి వారని, వారి ఆలోచనలు వారివన్నారు. తాము ఫ్యామిలీగా ఒకటి, రాజకీయంగా టూ అన్నారు. తమ మధ్య విభేదాలేమోనని అభిమానులు కొంత సెన్సిటివ్‌గా ఫీలవుతుంటారని వాపోయారు. విభేదాల్లేవన్నారు.

పవన్‌కు రాజకీయాలంటే ఇష్టమని, సక్సెస్ కావాలని కోరుకుంటున్నానన్నారు. రాజకీయాల్లోకి వస్తే తమకు మద్దతిస్తాడని తాను అనుకోలేదని, కానీ ఇలా వస్తాడనుకోలేదన్నారు. రాజకీయాల్లోకి వచ్చి వేరే పార్టీలకు మద్దతిస్తాడని భావించలేదని అన్నారు. రాజకీయంగా వేరు అన్నారు.

English summary
Congress Party senior MP Chiranjeevi responds on Division and Jana Sena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X