ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు.! ప్రభుత్వ అధికారిక నిర్వహణ.!21న పాల్గొననున్న సీఎం కేసీఆర్.!

హైదరాబాద్ : క్రైస్తవులు పరమ పవిత్రంగా జరుపుకునే కిష్టమస్ పర్వదినాన్ని అధికారికంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఇందుకు సంబంధించి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను చేస్తోంది ప్రభుత్వం. ఈనెల 21వ తేదీ సాయంత్రం ప్రారంభమయ్యే ఈ ఉత్సావాలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలుస్తోంది. ఎల్బీ స్టేడియంలో కొనసాగుతున్న ఏర్పాట్లను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పులఈశ్వర్ శుక్రవారం పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు.

 ఎల్.బి.స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు.. అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు

ఎల్.బి.స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు.. అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు

పోలీసు, రెవెన్యూ, ప్రోటోకాల్, వైద్యారోగ్య, విద్యుత్, జిహెచ్ఎంసి,వాటర్ వర్క్స్ తదితర శాఖలు, వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఈ క్రిస్మస్ సన్నాహక సమావేవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు.ఈ వేడుకల నిర్వహణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. కరోనా కారణంగా గత ఏడాది నిర్వహించలేకపోయామని, క్రిష్టియన్ కుటుంబాలకు దుస్తుల పంపిణీ మాత్రం జరిగిందని అన్నారు. ఈ సారి ఎల్.బి.స్టేడియంలో జరిపే ప్రధానమైన వేడుకకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుముఖ్య అతిథిగా హాజరవుతారని స్పష్టం చేసారు కొప్పుల ఈశ్వర్.

 క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు.. హాజరు కానున్న రాష్ట్ర ప్రముఖులు

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు.. హాజరు కానున్న రాష్ట్ర ప్రముఖులు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పలువురు ప్రముఖులకు పురస్కారాలు అందజేసి,సత్కరిస్తారని మంత్రి తెలిపారు. ఈ వేడుకలకు ముగ్గురు బిషప్ లు, క్రిస్టియన్ సమాజానికి చెందిన పలువురు ప్రముఖులు,పెద్దలు, వివిధ చర్చిల ఫాదర్స్, పాస్టర్స్, బ్రదర్స్, సిస్టర్స్ అతిథులుగా హాజరవుతారని, ఈ వేడుకలలో సుమారు 12వేల మంది పాల్గొంటారని అన్నారు. ఈ ఉత్సావాల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు జరుగకుండా, అశ్రద్ధ, నిర్లక్ష్యానికి తావులేకుండా సజావుగా, దిగ్విజయం అయ్యేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అదికారులను ఆదేశించారు.

 క్రిస్మస్ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు.. దగ్గరుండి పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్..

క్రిస్మస్ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు.. దగ్గరుండి పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్..

ఇదిలా ఉండగా అందరికి సరిపడే విధంగా భోజన ఏర్పాట్లు ఉండాలని, సర్వీసింగ్ కోసం వాలంటీర్లను నియమించుకోవాలని, 50 ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేవించారు. వాలంటీర్లు, పోలీసులు అతిథులను గుర్తించి, మర్యాదపూర్వకంగా స్టేజీపైకి తోడ్కొని రావాలని సూచించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ శుచి, రుచి, శుభ్రతను పరిశీలించాలని అన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది అవసరమైన వారికి కరోనా పరీక్షలు జరిపేందుకు కూడా సిద్ధంగా ఉండాలని, ఇందుకు సంబంధించిన జాగ్రత్తలు సూచిస్తూ పోస్టర్లు అతికించాలని, అంబులెన్సు లు సిద్ధంగా ఉంచాలి మంత్రి ఆదేశించారు.

 వసతుల కల్పనలో రాజీ పడొద్దు.. ఎస్బీ స్టేడియం దేదీప్యంగా మారిపోవాలన్న మంత్రి

వసతుల కల్పనలో రాజీ పడొద్దు.. ఎస్బీ స్టేడియం దేదీప్యంగా మారిపోవాలన్న మంత్రి

తాగునీటి కొరత లేకుండా చూసుకోవాలని, పారిశుధ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని, మోబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉన్నతాదికారులను ఆదేశించారు. భద్రతా, బందోబస్తు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, ప్రెస్ అండ్ మీడియా, పురస్కార గ్రహీతల గ్యాలరీలను ఏర్పాటు చేయాలని అన్నారు. వేడుకలు అందరికి సుస్పష్టంగా కనిపించే విధంగా ఎల్ఈడి తెరల ఏర్పాటు జరగాలని, స్టేడియం చుట్టుపక్కల స్వాగత తోరణాలు, క్రిస్మస్ ట్రీలతో పాటు చక్కని లైటింగ్ ఏర్పాట్లు జరగాలని అన్నారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, ఎమ్మెల్యే స్టీవెన్ సన్, ఐఎఎస్ అధికారులు నదీం అహ్మద్, విజయ్ కుమార్, హరివిందర్ సింగ్, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ సలీం, నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్,ఐపిఎస్ తదితరులు అధికారులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+