ఎంసెట్ 2: పూణెలో మరో బ్రోకర్ రామకృష్ణ అరెస్ట్, కోట్లు వసూలు చేశాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఎంసెట్ 2 పేపర్ లీకేజి కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం సాగుతోంది. పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి రామకృష్ణ అనే వ్యక్తిని సీఐడీ అధికారులు పూణెలో అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసిన షేక్ రమేశ్‌కు రామకృష్ణ పేపర్ అమ్మినట్లుగా తెలుస్తోంది.

పూణెలో ప్రత్యేక క్యాంపుని నిర్వహించిన రామకృష్ణ రెండు రోజుల ముందు అక్కడే మకాం వేసి విద్యార్ధులతో ప్రిపేర్ చేయించినట్లుగా సీఐడీ గుర్తించింది. అంతేకాదు షేక్ రమేశ్ ద్వారా విద్యార్ధుల తల్లిదండ్రుల వద్ద కోట్ల రూపాయలను వసూలు చేశాడు. ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఎంసెట్ 2 పేపర్ లీకేజి అయిన తర్వాత ఢిల్లీ, ముంబై కేంద్రంగా లీకేజి వ్యవహారం జరిగినట్లుగా సీఐడీ పేర్కొంది.

Cid police arrest rama krishna in eamcet 2 paper leakage

దీంతో ఢిల్లీ, ముంబైలతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎంసెట్ 2 పేపర్ లీకేజిలతో సంబంధం ఉన్న బ్రోకర్లును వరుసపెట్టి సీఐడీ అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. ఎంసెట్ 2 లీకేజి వ్వవహారంలో చక్కం తిప్పిన ముగ్గురు వ్యక్తులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఎంసెట్ 2: షేక్ రమేశ్ అరెస్ట్, 37 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న సీఐడీ

రామకృష్ణను తమదైన శైలిలో విచారించిన పోలీసులు కొత్త విషయాలను వెలికితీశారు. మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి అనుచరులు వెంకటేశ్, తరుణ్‌రాజ్ కర్నూలులో ఉన్నారని గుర్తించిన సీఐడీ అధికారులు.. అక్కడి హోటల్ సూరజ్ రెసిడెన్సీలో వారిద్దరినీ శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారని తెలిసింది.

ఈ ఇద్దరు బ్రోకర్లు హైదరాబాద్‌లోని రెజోనెన్స్ మెడికల్ అకాడమీ డైరెక్టర్లుగా గుర్తించారు. గురువారం మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో సూరజ్ హోటల్‌లో 309 గదిని బుక్ చేసుకున్నారు. కారు నంబరు ఆధారంగా వీరిని కర్నూలులో సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.

Cid police arrest rama krishna in eamcet 2 paper leakage

వీరిద్దరూ ఎంత మంది విద్యార్థులకు ప్రశ్నాపత్రాలను లీక్ చేశారో అతి త్వరలోనే చెబుతామని సీఐడీ అంటోంది. ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్ లీక్ చేసిన ఇక్బాల్.. రాజగోపాల్ ద్వారా ఈ మొత్తం కుంభకోణాన్ని నడిపించినట్టు సీఐడీ నిర్ధారించింది. అయితే ఇక్బాల్ నేరుగా ఈ కేసులోకి రాకుండా తన అనుచరులు, రాజగోపాల్‌రెడ్డి నెట్‌వర్క్‌తో ప్రిపరేషన్ చేయించాడని తెలుస్తోంది.

ఎంసెట్ 2 లీకేజీలో మధ్యవర్తిగా 'తిరుమల్': ఎక్కడి వాడు, ఏం చేశాడు?
లీక్ చేసిన పేపర్‌పై మొత్తం ఐదు ప్రాంతాల్లో విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించారని తెలిసిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ముంబై, బెంగళూరుతోపాటు పుణె వివరాలు విచారణలో బయటకు వచ్చాయని, మరో రెండు ప్రాంతాల విషయంలో స్పష్టతరావాల్సి ఉందని ఆయన వివరించారు.

ఢిల్లీతో పాటు చండీగఢ్‌లోనూ కొందరు విద్యార్థులను ప్రిపేర్ చేయించారని ప్రాథమిక ఆధారాలు లభించాయని, దీనిపై శనివారం మధ్యాహ్నం కల్లా స్పష్టత వస్తుందని సీఐడీ అధికారులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Crime Investigation Department (CID) has arrested at least four persons including the main suspect Rajgopal Reddy, who was earlier involved in Dr NTR University of Health Sciences Post-graduate Medical entran-ce scam of 2014, in connection with the Eamcet-2 question paper leak.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి