వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసు సిట్‌కు: నయీం సంగతి తెల్సుగా.. శాటిలైట్ ఫోన్‌తో 'షాడో' అధికారి!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం ఎన్‌కౌంటర్ నేపథ్యంలో.. అతని గుట్టు రట్టు తేల్చే పనిలో పోలీసులు పడ్డారు. నయీం కేసును సిట్‌కు అప్పగించాలని డిజిపి అనురాగ్ శర్మ నిర్ణయించారు. హైదరాబాద్ రేంజ్ ఐజీ, డిఐజీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లతో డీజీపీ అనురాగ్ భేటీ అయ్యారు.

అనంతరం ఈ కేసును సీట్‌కు అప్పగించాలని నిర్ణయించారు. ఓ దశలో సీఐడీకి అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, ఐపీఎస్ అధికారి నాగిరెడ్డి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు తేలిన లెక్కల ప్రకారం నయీం 2,200 ఎకరాలు కబ్జా చేసినట్లుగా గుర్తించారని తెలుస్తోంది.

కాగా, నార్సింగిలోని నయీం నివాసంలోని రెండో అంతస్తులోని నయీం వ్యక్తిగత గదిలో పోలీసులు సోదాలు ప్రారంభించారు. ఈ సోదాలు రెండు మూడు గంటలు కొనసాగేలా కనిపిస్తున్నాయి. ఈ గదిలోకి నయీం తప్ప ఎవరూ వెళ్లకపోయేవారు. కాబట్టి ఈ గదిలో కీలక పత్రాలు ఉండి ఉంటాయని భావిస్తున్నారు.

శాటిలైట్ ఫోన్‌తో..

నయీం వెనుక పలువురు ప్రముఖులు ఉన్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఓ పోలీస్ అధికారి అయితే నయీంతో తరుచూ మాట్లాడేవాడని వార్తలు వస్తున్నాయి. ల్యాండ్ సెటిల్మెంట్స్ చేయించేవాడని చెబుతున్నారు.

ఎక్కడైనా నయీం పైన ఫిర్యాదులు వస్తే రంగంలోకి కూడా దిగేవాడని చెబుతున్నారు. స్థానిక పోలీసులు వినకుంటే నయీం సంగతి తెలుసుగా అని బెదిరించేవాడని అంటున్నారు. నయీం గురించి బయటకు పొక్కకుండా అతను జాగ్రత్తలు తీసుకునే వాడని అంటున్నారు.

సదరు అధికారి తమ సంభాషణలు ట్రాకింగ్ కాకుండా ఏకంగా శాటిలైట్ ఫోన్‌నే వాడేవాడని వార్తలు వస్తున్నాయి. నయీం కూడా శాటిలైట్ ఫోన్ వాడేవాడు. నయీం మృతి తర్వాత ఈ శాటిలైట్ ఫోన్ వ్యవహారం బట్టబయలైంది.

 గ్యాంగ్‌స్టర్ నయీం

గ్యాంగ్‌స్టర్ నయీం

గత రెండున్నర దశాబ్దాలగా పైగా నల్గొండ జిల్లాను శాసించిన గ్యాంగ్ స్టర్‌ నయీం అనుచరుల్లో పలువురు పోలీసులూ ఉన్నట్లు తెలుస్తోంది. నయీం స్వస్థలానికి చెందిన డివిజన్‌ పరిధిలో పని చేసిన పోలీస్‌ సబ్ డివిజన్‌ అధికారుల నుంచి సీఐ, ఎస్సై, కిందిస్థాయి సిబ్బంది సహా పలువురు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

 గ్యాంగ్‌స్టర్ నయీం

గ్యాంగ్‌స్టర్ నయీం

వారికి తాను చేసిన సాయం, నగదుతో పాటు స్థిరాస్తులు కూడబెట్టుకున్న తీరును నయీం తన డైరీల్లో రాశాడని తెలుస్తోంది. ఈ విషయాలు ఎస్బీ, నిఘా విభాగాల ద్వారా బయటకు పొక్కడంతో జిల్లా అధికారులు ఆయా అంశాలపై గోప్యత పాటిస్తున్నారు.

గ్యాంగ్‌స్టర్ నయీం

గ్యాంగ్‌స్టర్ నయీం

కొందరు అధికారులు కనీసం ఫోన్‌ కూడా ఎత్తని పరిస్థితులున్నాయి. నయీంతో సంబంధాలున్న జిల్లా కేంద్రానికి చెందిన ఒకటి రెండు వర్గాల వారినీ పోలీసులు కాపాడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని అధికార పార్టీ నాయకులు, భువనగిరి, జిల్లా కేంద్రానికి చెందిన పాత్రికేయులు, ఎలక్ట్రానిక్‌ మీడియా సభ్యులకు కూడా నయీం ముఠాతో సంబంధాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 గ్యాంగ్‌స్టర్ నయీం

గ్యాంగ్‌స్టర్ నయీం

అతి తక్కువ కాలంలో రూ.కోట్లు సంపాదించిన ఎలక్ట్రానిక్‌ మీడియా సభ్యులనూ ఈ డైరీలో పొందు పరిచినట్లు తెలుస్తోంది. నయీం ముఠాతో పోలీసుల కుమ్మక్కు విషయాలు ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో వెలుగుచూసే అవకాశముంది.

English summary
CID to probe crimes and properties of gangster Nayeemuddin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X